BigTV English

AP New DGP Names : ఏపీ డీజీపీకి ముగ్గురి పేర్లు సిఫార్సు.. కొత్త డీజీపీ ఎవరు ?

AP New DGP Names : ఏపీ డీజీపీకి ముగ్గురి పేర్లు సిఫార్సు.. కొత్త డీజీపీ ఎవరు ?

AP New DGP Names : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ పోస్టులో నియమించేందుకై ముగ్గురి పేర్లను సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఐపీఎస్ అధికారుల జాబితాలో సీనియర్లుగా ఉన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను ఈసీకి పంపింది.


ద్వారకా తిరుమలరావు 1990 బ్యాచ్ కు చెందిన అధికారి అవ్వగా.. మాదిరెడ్డి ప్రతాప్ 1991 బ్యాచ్, హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ లకు చెందినవారు. వీరిలో హరీష్ కుమార్ ప్రస్తుతం హోం శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ముగ్గురిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. కాగా.. డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాయంత్రానికల్లా డీజీపీ నియమాకంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏపీ ఇన్ చార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శంఖబత్ర బాగ్చీని నియమించారు. కేవీ రాజేంద్రనాథ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కొత్త డీజీపీ నియమితమయ్యేంతవరకూ బాగ్జీ తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.


Tags

Related News

Jagan on Pulivendula: జగన్ ప్రెస్ మీట్.. ఓటమిని అంగీకరిస్తున్నారా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Big Stories

×