Vahana Mitra scheme: వాహన మిత్ర పథకం అమలుకు చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏపీలో ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు ఏడాదికి రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీలో ఉచిత బస్సు స్కీమ్ పెట్టిన తర్వాత ఆటోలకు ఆదాయాలు అమాంతంగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో వారికి ప్రత్యేకంగా పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. అన్నట్లుగా అందుకు సంబంధించి పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. దీనికి కొత్త విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
సెప్టెంబర్ 17 నుంచి ఈ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులను స్వీకరించనుంచి ప్రభుత్వ. వాహన మిత్ర పథకం కింద ఏపీలో ఆటోడ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు సొంత వాహనం కలిగి, దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తించనుంది.
వారికి ప్రభుత్వం నుంచి రూ. 15 వేల రూపాయలు అందుతుంది. మరో విషయం ఏంటంటే వాహనం రాష్ట్ర పరిధిలో రిజిస్టేషన్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌ల రిజిస్ట్రేషన్, వెహికిల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి. ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి. బీపీఎల్ కుటుంబానికి చెందినవారైతే రేషన్ కార్డు ఉండాలి.
ALSO READ: సీఎం చంద్రబాబు సంకేతాలు.. సబ్జెక్టుతో రావాల్సిందే
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ స్కీమ్ వర్తించదు. వాహనాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు. ఆటో డ్రైవర్ల ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్ట అయతే 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు, కమర్షియల్ భూమిలో నిర్మాణం ఉండరాదు.
ఈ పథకానికి దరఖాస్తులు గ్రామ, వార్డు సచివాలయం విభాగం సిద్ధం చేస్తోంది. ఈనెల 17 నుంచి 19 వరకు అప్లికేషన్లకు అవకాశం ఇచ్చింది. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈనెల 24కు ఫైనల్ జాబితా రెడీ చేస్తారు. అక్టోబరు 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది ప్రభుత్వం.
'ఆటో మిత్ర' పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు
ఏపీలో ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు ఏడాదికి రూ.15 వేలు 'ఆటో మిత్ర' పేరుతో ఇవ్వాలని నిర్ణయం
2025-26 ఆర్థిక సంవత్సరానికి విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఉత్తర్వులు జారీ చేసిన రవాణ… pic.twitter.com/gZKqkmrBR6
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025