Raghava lawrance : తమిళ స్టార్ హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రాఘవ లారెన్స్ సామాజిక కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా అభిమానుల మనసుల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన ఓ చారిటబుల్ ట్రస్ట్ అని నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం అందిస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నాడు. రీసెంట్ గా తన ఇంటిని పాఠశాల గా మార్చి మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరో రాఘవ లారెన్స్ మనసు ఎంత గొప్పదో అందరికీ తెలుసు.. ఆయన ఈమధ్య ఎక్కువగా సాయం కోరిన వారికి సాయం అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా దివ్యాంగులైనా డ్యాన్స్‌లో రాణిస్తున్న కొందరు యువకులను పిలిచి తగిన విధంగా గౌరవించారు. వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ట్రీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నేను డ్యాన్సర్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రేక్షకులు నా దగ్గరి వచ్చి రూ.1 కాగితాలను నా చొక్కాకు గుచ్చేవారు. పూల దండలు వేసేవారు. ఆ ప్రోత్సాహం నాకెంతో సంతోషంగా ఉండేది. అలాంటి ఆనందాన్నే నా బాయ్స్‌కు కూడా ఇవ్వాలనుకున్నాను. వాళ్లను ఆశ్చర్య పరచాలనుకున్నాను. అందుకే వాళ్లపై నోట్ల జల్లు కురిపించాను. ఇది కేవలం వారిని ప్రశంసించడమే కాదు, వారి ప్రతిభకు ప్రోత్సాహం.. మీకు సంబంధించిన కార్యక్రమాలలో ఇలాంటివారిని పిలిచి వాళ్ళ టాలెంట్ ని ప్రోత్సహించండి 10 మందికి వారిని గుర్తించే అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసిన ఆయన అభిమానులు లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
రాఘవ లారెన్స్ దివ్యాంగులకు ఎప్పుడూ అండగా ఉంటారు. ఎవరికి తన సాయం అందాలో వాళ్ళకి కచ్చితంగా అందించడంలో ముందుంటారు. పిల్లలతో పాటుగా అనేకమంది దివ్యాంగులను ఆయన చేరదీసి వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు. ఆయన ప్రారంభించిన ట్రస్టు ఎంతోమందికి జీవితాన్నిచ్చింది. నిత్యమైన వారితో గడుపుతూ ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. ఈ మధ్య లారెన్స్ కు సంబంధించిన పను వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.. తమిళనాడు ఆయనని దేవుడిగా భావించేవారు ఎందరో ఉన్నారు. సాయం కోరిన వారికి సాయం అందిస్తూ రియల్ హీరోగా అభిమానుల మనసుని దోచుకున్నారు లారెన్స్..
Also Read : ‘మిరాయ్’ కు బిగ్ షాక్.. HD క్వాలిటితో ప్రింట్ లీక్..
ప్రస్తుతం రాఘవ లారెన్స్ సినిమాల విషయానికొస్తే ఆయన కాంచన 4 చేస్తున్నాడు. ఈ సినిమాలో దాదాపు ముగ్గురు హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సినిమా షూటింగ్లో భాగమయ్యారు. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లలోకి రాబోతుంది. గతంలో వచ్చిన సిరీస్ లు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే…
Hi everyone,
You all know the incredible journey I’ve shared with my specially-abled boys so far. Back in the days when I was a dancer, audiences would often pin Re. 1 notes and place them as garlands on me, a gesture of appreciation.
I wanted to recreate that same joy for my… pic.twitter.com/r8hYcy1kxj
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2025