Chris Lynn : టీ-20 బ్లాస్ట్ 2025 2వ సెమీ పైనల్ లో నార్తాంప్టన్ షేర్ పై హాంప్ షైర్ ప్లేయర్ క్రిస్ లిన్ విజృంభించాడు. 51 బంతుల్లోనే 11 సిక్స్ లు, 5 ఫోర్లతో 108 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ని గెలిపించాడు. వర్షానికి 18 ఓవర్లకు ఆటను కుదించగా.. నార్తాంప్టన్ పై షేర్ 158జ7 రన్స్ చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో టార్గెట్ 155 కి తగ్గింది. దీంతో లక్ష్య ఛేదనలో 15వ ఓవర్ లో క్రిస్ లిన్ వరుసగా 6,6,6,6,6 లు బాదాడు. ఫైనల్ లో సోమర్ సెట్ పై లిన్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.
Also Read : IND Vs PAK : గిల్ లేకుండానే పాక్ తో మ్యాచ్… జట్టు సభ్యులు వీళ్ళే.. టైమింగ్స్, ఫ్రీ గా చూడాలంటే ఎలా
మ్యాచ్ ని పరిశీలించినట్టయితే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్ షేర్ ఓపెనర్ రికార్డో వాస్కోన్సెలోస్ 19 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ విల్లీ మాత్రం డకౌట్ అయ్యాడు. బోప్రా 09, టిమ్ రాబిన్ సన్ 11, జస్టిన్ బ్రోడ్ 61, లూయిస్ మెక్ మానస్ 12, ప్రోక్టర్ 30 పరుగులు చేయడంతో 158జ7 పరుగులు చేసింది. ఇక స్కాట్ కర్రీ 2, సోన్నీ బేకర్ 1, వుడ్ 1 వికెట్ చొప్పున తీసుకున్నారు. 159 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగింది ఓపెనర్ అల్బర్ట్ 8 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ మాత్రం విజృంభించి 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జేమ్స్ విన్స్ 12, బెన్ మెయిస్ 09, అలిస్టైర్ 2, ఫుల్లర్8 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 15.4 ఓవర్లలో హ్యాంప్ షైర్ ప్లేయర్ జట్టు విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. మరోవైపు ఫైనల్ లో మాత్రం సోమర్ సెట్ విజేతగా నిలిచింది. హ్యాంప్ షేర్ పై 6 వికెట్ల తేడాతో సోమర్ సెట్ టీ-20 బ్లాస్ట్ 2025 గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్ షైర్ అల్బర్ట్, కెప్టెన్ జేమ్స్ విన్స్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అయితే టీ-20 బ్లాస్ట్ ఫైనల్స్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్ కావడం విశేషం. అయితే ఈ స్కోర్ ను హ్యాంప్ షైర్ కాపాడుకోలేకపోయింది. విల్ స్మిడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సోమర్ సెట్ ని గెలిపించాడు. కెప్టెన్ లెవిస్ గ్రెగరీ మరో ఓవర్ మిగిలి ఉండగానే సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. టాబీ ఆల్బర్ట్ 48 బంతుల్లో 85, జేమ్స్ విన్స్ 34 బంతుల్లో 52 చెలరేగడంతో హ్యాంప్ షైర్ భారీ స్కోర్ చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్ లో క్రిస్ లిన్ 12, జేమ్స్ పుల్లర్ 1, బెన్ మేయర్స్ 09, అలీ బర్ 3 పరుగులు మాత్రమే చేయగలిగారు. సోమర్ సెట్ బౌలర్లలో జేక్ బాల్ 2, గ్రెగరీ 1, గోల్డ్ వర్తి తలో వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకి దిగిన సోమర్ సెట్.. విల్ స్మిడ్ 58 బంతుల్లో 94 పరుగులు చేశాడు. 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సిన్ డిక్సన్ 22 బంతుల్లో 33 నాటౌట్ గా నిలిచాడు. గ్రెగరీ 5 బంతుల్లో 18 నాటౌట్ గా నిలవడంతో సోమర్ సెట్ విజయానికి చేరుకోవడంలో చివర్లో వీరు కీలక పాత్ర పోషించారు.