Sankranti Holidays AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇఛ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని వివరించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు స్థానిక అధికారులు ఇప్పటికే సెలవులు ప్రకటించినందున, ఈసారి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లేదా 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నామని అధికారులు తెలిపారు.