Serum For Hair: నిరంతరం మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో పాటు మరెన్నో విషయాలు చర్మంతో పాటు జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.ఇలాంటి సమయంలో కొన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం చాలా ముఖ్యం. ఈ ఉత్పత్తులలో హెయిర్ సీరం ఒకటి. ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ సీరమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ హెయిర్ సీరమ్ జుట్టుకు ప్రయోజనం కలిగించడానికి బదులుగా హాని కలిగిస్తుంది.
అటువంటి పరిస్థితిలో హెయిర్ సీరమ్ కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. సీరం కొనుగోలు చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రకాన్ని బట్టి హెయిర్ సీరం:
హెయిర్ సీరమ్ కొనుగోలు చేసేటప్పుడు మీ జుట్టు రకాన్ని గుర్తుంచుకోండి . ఉదాహరణకు పొడి జుట్టు కోసం హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉన్న సీరమ్‌ను ఎంచుకోండి. ఇందులో ఆర్గాన్ ఆయిల్, జోజోబా ఆయిల్ లేదా విటమిన్ ఇ ఉండేలా చూసుకోండి. జిడ్డు జుట్టు కోసం తేలికపాటి, జిడ్డు లేని వారు ఫార్ములాతో సీరమ్‌ను ఎంచుకోండి.చివర్లు చిట్లిన జుట్టు కోసం ఎల్లప్పుడూ యాంటీ-ఫ్రిజ్ లక్షణాలు అధికంగా ఉండే సీరమ్‌లను ఎంచుకోండి.డ్యామేజ్ జుట్టు కోసం ఎల్లప్పుడూ హీట్ ప్రొటెక్షన్ , రిపేరింగ్ లక్షణాలతో ఉన్న సీరమ్‌లను ఎంచుకోండి.
ఇలాంటి సీరం ఎంచుకోండి:
హెయిర్ సీరమ్‌ను కొనుగోలు చేసేటపుడు తప్పనిసరిగా సహజ నూనెలు ఉండేలా చూసుకోవాలి. మీ సీరమ్‌లో ఆర్గాన్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా జోజోబా ఆయిల్ ఉంటే.. అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ E, B5 ఉంటే ఇవి జుట్టుకు పోషణ అందిస్తాయి. అంతే కాకుండా షైనీగా చేస్తాయి. కాబట్టి హెయిర్ సీరమ్‌లు కూడా వీటిని కలిగి ఉండాలి.
జుట్టు సమస్యల ప్రకారం కొనండి :
మీ జుట్టు సమస్యని బట్టి హెయిర్ సీరం కొనండి. మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉంటే డీప్ కండిషనింగ్ సీరమ్‌ను ఎంచుకోండి. జుట్టు రాలుతుంటే.. బలపరిచే సీరం ఉపయోగించండి. రంగు జుట్టు కోసం, రంగు-రక్షించే లక్షణాలతో కూడిన సీరమ్‌ను ఎంచుకోండి. ఇవి జుట్టుకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
Also Read: తెల్లజుట్టు ఉన్న వారు ఇలా హెన్నా వాడితే.. క్షణాల్లోనే రిజల్ట్
హెయిర్ సీరమ్ కొనుగోలు చేసేటప్పుడు ఏ అంశాలను గుర్తుంచుకోవాలి ?
ఎల్లప్పుడూ బ్రాండ్‌ల నుండి సీరమ్‌లను కొనుగోలు చేయండి. కొనుగోలు చేయడానికి ముందు ఆన్‌లైన్ రేటింగ్ చూడండి. రివ్యూ బాగుంటేనే సీరం కొనండి.
అలెర్జీ టెస్ట్ చేయండి :
మీ చర్మానికి హాని కలిగించదని నిర్ధారించుకోవడానికి కొత్త సీరమ్‌ను కొనుగోలు చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. తర్వాత మాత్రమే సీరం కొనండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.