AP Womens: ఏపీ మహిళలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు భారీ యోజనతో చేపట్టిన ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ఇంతకు ఆ క్లారిటీ ఏమిటి? ఎంత మందికి అందజేస్తారో తెలుసుకుందాం.
మహిళలకు ప్రాధాన్యత..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పవచ్చు. దీపం పథకం 2.0 పథకం తో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాదు మహిళా ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రసూతి సెలవులను 180 రోజులకు పెంచింది. అలాగే వచ్చే నెలలో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ. 15 వేల నగదు జమ కానుంది. ఇలా మహిళల సంక్షేమానికి ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదని ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు.
స్వయం ఉపాధిలో మహిళలు
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత దగ్గరికి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళ ఆర్థికంగా బలోపేతం చెందితే కుటుంబం మరింత బలోపేతం అవుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు దరి చేరేందుకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ శిక్షణకు శ్రీకారం చుట్టింది.
ఉచిత కుట్టు మిషన్ శిక్షణ
మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందిస్తే సాధ్యమైనంత త్వరగా వారు స్వయం ఉపాధిలో రాణించే అవకాశాలు అధికమని సీఎం చంద్రబాబు ఉద్దేశం. అంతేకాకుండా మహిళలకు కుట్టు మిషన్ విద్య నేర్చుకోవడం సులువు. అందుకే ఏపీలోని అన్ని జిల్లాలలో కుట్టు మిషన్ శిక్షణ అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అపోహలు..
ఏపీలో కుట్టు మిషన్ శిక్షణ గురించి ప్రజల్లో అపోహలు తలెత్తేలా పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనితో కాస్త మహిళల్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణపై పలు అనుమానాలు వ్యక్తమైన పరిస్థితి. అందుకే ఆ అనుమానాలను నివృతి చేస్తూ రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఓ క్లారిటీ ఇచ్చారు.
Also Read: Pakistan Crisis: ఒక్క దెబ్బకు పాక్ విలవిల.. ATMలు ఖాళీ.. మార్కెట్లు బంద్..
ఉచితంగా కుట్టుమిషన్లు..
మహిళలను ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సవిత తెలిపారు. లక్షా రెండు వేల మందికి పైగా మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా అందజేసి, నిష్ణాతులతో 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 3 లక్షలకు పైగా మహిళలు ఉచిత కుట్టు శిక్షణకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో అర్హులైన లక్షా 2 వేల మందిని లబ్ధిదారులు ఎంపిక చేశామని తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 720 శిక్షణా కేంద్రాల్లో మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేస్తున్నామన్నారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలో ఒక లక్ష 2 వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్ అందించేందుకు ప్రభుత్వం సిద్దమైందని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం.. మీ సమీపంలో గల సచివాలయాన్ని సంప్రదించి, కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ను ఒకసారి ఆశ్రయించండి.