Curran’s son : సాధారణంగా క్రికెటర్ల గురించి కొత్త కొత్త వింత విశేషాలుంటాయి. వారిలో ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర భారతీయుడే. కానీ వాళ్ల ఫ్యామిలీ న్యూజిలాండ్ కి వెళ్లి సెటిల్ కావడంతో అతను న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు. న్యూజిలాండ్ పౌరసత్వమే ఉంది. ఇక ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కర్రన్ ఇంగ్లండ్ తరపున ఆడుతాడు. అతని సోదరుడు టామ్ కరణ్ కూడా ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడుతాడు. అయితే బెన్ కరణ్ మాత్రం జింబాబ్వే తరపున ఆడుతాడు. కరణ్స్ యొక్క తండ్రి కెవిన్ కరణ్ 11 వన్డేలు జింబాబ్వే తరపున ఆడటం విశేషం. వాళ్లు జింబాబ్వే నుంచి ఇంగ్లండ్ కి వెళ్లారు. అక్కడే సెటిల్ అయ్యారు. అలా కరణ్స్ ఇద్దరూ ఇంగ్లండ్ నుంచి ఆడితే.. ఒకరు జింబాబ్వే నుంచి ఆడటం విశేషం.
Also Read : Dhanashree : బాలీవుడ్ నటుడికి చాహల్ భార్య ధనశ్రీ సరెండర్.. హగ్ ఇచ్చి మరి
ఇక సామ్ కరణ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఇతను అంతగా ఫామ్ లో కొనసాగడం లేదు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి వెళ్లకుండానే అన్ని జట్ల కంటే ముందే ఇంటి బాట పట్టింది. చెన్నై తో పాటు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు మాత్రమే ఛాన్స్ ఉంది. ఢిల్లీ కి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా జట్ల పై ఆధారపడాల్సి ఉంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సామ్ కరన్ తమ మాజీ జట్టు పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ పై మండిపడ్డాడు. ఇటీవల చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో మైదానం లోనే పంజాబ్ జట్టుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. సామ్ కరన్ (88; 47 బంతుల్లో 9×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కే 190 పరుగులు చేసి ఆలౌటైంది. నెం.3వ స్థానంలో వచ్చిన సామ్ కరన్ బ్రిలియంట్ నాక్ ఆడాడు. 47 బంతుల్లో 88 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో అతడికి ఇది తొలి అర్ధ శతకం కావడం విశేషం. కానీ ఆ తర్వత లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఊదేయడంతో చెన్నై ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా తప్పుకుంది. 18వ ఓవర్ లో ఔట్ అయిన సామ్ కరన్.. మార్కో జాన్సన్ బౌలింగ్ లో జోస్ ఇంగ్లిష్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తన ఔట్ కన్ఫామ్ అయ్యాక క్రీజును వీడాడు. అయితే క్రీజు నుంచి సీఎస్కే డగౌట్ వైపు నడుస్తూ వెళ్లే క్రమంలో సామ్ కరన్ అసహనం వ్యక్తం చేయడం విశేషం.
?igsh=aHhiN3dqeG9xZGli