Manchu Vishnu: మంచు విష్ణు కీలక పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కన్నప్ప. ఈ మూవీ మంచి విష్ణు డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతోమంది స్టార్ నటినటులు నటిస్తుండడంతో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో మూవీ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. మంచు విష్ణు టాలెంట్ ను బయట పెట్టే ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో పై మీరు లుక్కేయండి..
నేను స్టంట్ మాస్టర్ గా..ఆ సీన్స్ చేశాను
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తి, ఫాంటసీ కాన్సెప్ట్ తో శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా కన్నప్ప. ఏవిఏ ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై డాక్టర్ మోహన్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేశారు. కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు ఎంత కష్టపడుతున్నారు అన్నది ఈ వీడియో చూసిన వారికి అర్థమవుతుంది. స్వయంగా కథ రాయడమే కాక, అన్ని పనులు ఆయనే చూస్తున్నారు. తాజాగా ఈ వీడియోలో విష్ణు స్టంట్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తుంది. చాలామందికి తెలియదు నేను నటుడిగా మారడానికి ముందు.. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను అని విష్ణు ఎల్ఎ లో స్టంట్ మాన్ గా పని చేశానని.. నేను తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిని అని తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరో కాకముందే మార్షల్ ఆర్ట్స్ లో విష్ణు ట్రైనింగ్ తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో తానే స్వయంగా స్టంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నట్లు విష్ణు తెలపడం విశేషం. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా విష్ణు తెలిపారు. మూవీని థియేటర్లో చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ విష్ణు పోస్ట్ చేశారు. ఇది చూసిన వారంతా విష్ణులో మరో టాలెంట్ ఉందంటూ మూవీ సక్సెస్ అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు.
మూవీలో విశేషాలు ..
ఇక కన్నప్ప విషయానికి వస్తే.. ఈ కథంతా హిందూ పురాణాలలో ప్రసిద్ధమైన శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతుంది. కన్నప్ప ఒక వేటగాడు అతను అత్యంత భక్తితో శివుడి అనుగ్రహం పొందడానికి ఆయనను ఎలా కొలిచారు, శ్రీకాళహస్తి ఆలయ మహత్యం, కన్నప్ప తన కళ్ళను శివుడికి సమర్పించడం వంటి ప్రధాన అంశాలతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి సంగీతాన్ని స్టీఫెన్ దేవన్స్ అందిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతుంది. దాదాపు ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఇప్పటికే మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా,మధుబాల, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, సప్తగిరి, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో మంచు ఫ్యామిలీ న్యూ జనరేషన్ కిడ్స్ మంచు విష్ణు కుమారుడు, కుమార్తెలు నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఎటువంటి రెమ్యూనేషన్ తీసుకోకుండా మూవీలో క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయిలో VFX ఆకట్టుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మూవీ జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://x.com/iVishnuManchu/status/1920102405519348034