Pakistan Crisis: భారతీయ రక్షణ వ్యవస్థ ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్‌లో తీవ్రమైన ఆర్థిక, భద్రతా అస్థిరత ఏర్పడింది. భారత వైమానిక దళం అత్యంత ఖచ్చితంగా అమలు చేసిన ఈ కార్యాచరణ అనంతరం పాక్ ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకున్నా, దేశమంతా పటిష్ఠ భద్రత ఏర్పాట్ల మధ్య ఏటీఎంల వద్ద భారీ క్యూలు, మార్కెట్ల వద్ద నిత్యావసరాల కోసం తడబడుతున్న జనసందోహం కనిపిస్తోంది.
ఎటిఎంల వద్ద ఖాళీ డబ్బు మిషన్లు
పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకుల కనెక్టివిటీ సమస్యలతో నగదు విత్ డ్రాలకు అంతరాయం ఏర్పడింది. కొందరు ఈ సమస్యలను సాంకేతిక లోపంగా చెబుతున్నారు. అయితే భారత ఆపరేషన్ తర్వాత ఇలా జరుగుతుండటంతో ఇది కేవలం సాంకేతిక లోపమేనా అనే అనుమానాలు జనంలో వ్యాపిస్తున్నాయి. అంతేకాదు ఏటీఎంల వద్ద భారీ క్యూ ఉండడం విశేషం.
మార్కెట్లలో తొక్కిసలాట
కరెన్సీపై భద్రతా భయాలు, దేశ భద్రత పట్ల ప్రభుత్వ మౌనం ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కూరగాయలు, నూనె, గోధుమపిండి వంటి వస్తువుల కోసం మార్కెట్ల వద్ద తొక్కిసలాట కనిపిస్తోంది. కొన్నిచోట్ల బ్లాక్ మార్కెట్ కూడా రాజుకుంటుండటంతో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.
సైబర్ దాడుల దుశ్చర్యలు?
పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఏటీఎం లకు సైబర్ దాడులు జరిగాయనే వాదనలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిని ఖండించింది. అయినా ఏటీఎం సేవలు నిలిపివేత, డిజిటల్ చెల్లింపులు నిలిచిపోవడం ప్రజలలో భయాన్ని రెట్టింపు చేసింది.
Also Read: Operation Sindoor: కసబ్ ట్రైనింగ్ స్థావరాన్ని.. టార్గెట్ చేసి పేల్చేసిన సైన్యం.. దెబ్బ అదుర్స్ కదూ!
రాజకీయ, భద్రతా సంక్షోభం దిశగా పాకిస్తాన్?
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రజల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భారత్ వేసిన ఒక్క ప్రతీకార అడుగుకు పాక్ ఇంత విలవిలాడుతుంది. కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తే, పాక్ ఎందుకింత ఉలిక్కి పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా వంకరబుద్ధి యవ్వారం మానుకొని, కాస్త బుద్ధిగా పాక్ ఉంటుందా లేదా అన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.