BigTV English

AP Govt: ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. న్యూ ఇయర్ గిఫ్ట్ మీకోసమే!

AP Govt: ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. న్యూ ఇయర్ గిఫ్ట్ మీకోసమే!

AP Govt: సామాజిక పింఛన్లు పొందే లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం పింఛన్ దారుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే సామాజిక పింఛన్ దారులకు వరాలు కురిపించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్ పొందే లబ్ధిదారులకు పింఛన్ నగదు పెంచి ఆర్థిక భరోసా కల్పించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే, పింఛన్ నగదు పెంచడంతో పాటు, మూడు నెలల కాలానికి సంబంధించి రూ. 3 వేల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగులకు ఏకంగా రూ. 6 వేలకు పెంచి కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

అంతేకాకుండా ఇటీవల మూడు నెలలు వరుసగా పింఛన్ పొందని లబ్ధిదారులకు ఒకేసారి నగదును పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామ వాలంటీర్లు గృహాలకు వెళ్లి పింఛన్ నగదును అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతినెల పింఛన్ నగదును పంపిణీ చేస్తున్నారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా, ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తూ, భరోసా కల్పిస్తోంది.


Also Read: Hindu Mantras: పిల్లలకు నేర్పాల్సిన శక్తివంతమైన 11 హిందూ మంత్రాలు

అయితే నూతన సంవత్సరానికి సంబంధించి పింఛన్ దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణంగా ప్రతి నెలా మొదటి మూడు రోజులలో పింఛన్ నగదును పంపిణీ చేస్తారు. అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి నెలకు సంబంధించిన పింఛన్, డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ నగదును అందుకుంటున్న లబ్ధిదారులకు ఈనెల ఒకరోజు ముందుగానే పింఛన్ నగదు అందనుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×