BigTV English

IND-W vs WI-W: వెస్టిండీస్ తో వన్డే సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా జట్టు

IND-W vs WI-W: వెస్టిండీస్ తో వన్డే సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా జట్టు

IND-W vs WI-W: సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ టీమ్ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్ – భారత్ మహిళా క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన 3 వన్డేల సిరీస్ ని భారత్ 3 -0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి వన్డేలో {IND-W vs WI-W} భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ 3 వ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసి.. 38.5 ఓవర్లలో 162 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. వెస్టిండీస్ బ్యాటర్లు చినిల్లే హెన్రీ (61) హాఫ్ సెంచరీ చేసింది.


Also Read: IND vs AUS 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. కష్టాల్లో టీమిండియా!

క్యాంప్ బెల్లే (46) పరుగులతో రాణించగా.. అలియా అలెన్ (21) పరుగులు చేసింది. ఇక {IND-W vs WI-W} ఓపెనర్లు క్వీనా జోసెఫ్ (0), హేలీ మ్యాథ్యూస్ (0) నీ ఖాతా తెరవకుండానే తొలి ఓవర్ లోనే రేణుక ఠాకూర్ అవుట్ చేసింది. కాగా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 31 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తన అద్భుత భౌలింగ్ తో విండీస్ మహిళల జట్టును బెంబేలెత్తించింది. ఇక మరో బౌలర్ రేణుక ఠాకూర్ కూడా అద్భుతంగా రాణించింది.


కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టింది. అనంతరం {IND-W vs WI-W} 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలో కాస్త తడబడింది. కానీ 28.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. టాప్ 3 బ్యాటర్లు స్మృతి మందాన (4), ప్రతీకా రావల్ (18), హార్లిన్ డియోల్ (1) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. దీప్తి శర్మ 48 బంతులలో 3 ఫోర్లు, 1 సిక్స్ తో (38) పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది.

అలాగే ఆరు వికెట్లను పడగొట్టి ఆల్ రౌండ్ ప్రదర్శనతో {IND-W vs WI-W} భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. అర్మన్ ప్రీత్ కౌర్ 28 బంతులలో 7 ఫోర్లతో (32) పరుగులు, జమీమా 45 బంతులలో (29), రిచా ఘోష్ 11 బంతులలో 3 సిక్స్ లతో 23 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్, కరిష్మా రామ్ హరక్, అలెన్, హీలి మ్యాథ్యూస్, ఫ్లెచెర్ తలో వికెట్ తీశారు.

Also Read: Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. జోకర్ అంటూ ఆసీస్ రచ్చ !

రెండవ వన్డేలో రాణించిన స్మృతి మందాన, హార్లీన్ డియోల్ మూడో వన్డేలో మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మొదటి వన్డేలో {IND-W vs WI-W} 60 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. రెండవ వన్డే లో 211 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ తో జరిగిన టి-20 సిరీస్ ని కూడా టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళా జట్టుకి సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు క్రీడాభిమానులు.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×