BigTV English

Vidaamuyarchi First Single: అజిత్ స్టైల్.. అనిరుధ్ మ్యూజిక్.. డెడ్లీ కాంబో అబ్బా.. అదిరిపోయింది అంతే

Vidaamuyarchi First Single: అజిత్ స్టైల్.. అనిరుధ్ మ్యూజిక్.. డెడ్లీ కాంబో అబ్బా.. అదిరిపోయింది అంతే

Vidaamuyarchi First Single: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ఆయనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. తెలుగులో కూడా అంతేముంది ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు హీరోలను కాదు.. కథ నచ్చితే ఆ సినిమాను హిట్ చేసేస్తారు. అయితే   కోలీవుడ్ నుంచి వచ్చిన స్టార్స్ లో రజినీకాంత్,  విజయ్, అజిత్, సూర్య, ధనుష్ లాంటి హీరోలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక ఆ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగులో కూడా హడావిడి మొదలవుతుంది.


తాజాగా అజిత్ నటించిన కొత్త చిత్రం విడాముయార్చి. ప్రముఖ రచయిత మగిళ్ తిరుమేని  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక  ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Jabardasth Sowmya Rao: ఈ ఇండస్ట్రీని నమ్ముకుంటే అంతే.. హాట్ యాంకర్ సంచలన వ్యాఖ్యలు


దాదాపు 13 సంవత్సరాల విరామం తర్వాత తల అజిత్, అర్జున్ సర్జా, త్రిష కలిసి నటిస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి గ్యాంబ్లర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,  స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వ‌చ్చే 2025 సంక్రాంతి రేసులో దిగనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా విడాముయార్చి నుంచి  మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

స‌వదీక‌ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. మంచి పార్టీ థీమ్ తో ఈ సాంగ్ నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

All We Imagine As Light : ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’… ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

ఇక సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే అజిత్ స్టైల్  మరో ఎత్తు. వైట్ హెయిర్, సూట్.. క్లీన్ షేవ్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. ఇంకోపక్క త్రిష కూడా తన అనడంతో మెస్మరైజ్ చేసింది. అరివు లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను  ఆంథోని దాస‌న్  పాడగా.. వోకల్స్ ను అనిరుధ్ పాడాడు.  ప్రస్తుతం ఈ సాంగ్  సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

యాక్షన్ సర్వైకల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్నాడు. అజిత్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్ళుగా  అజిత్ కు మంచి హిట్ అందింది లేదు. అందుకే ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నారు.  మరి ఈ సినిమాతో అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×