IND VS ENG,1st Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలిపోయింది. అందరూ ఊహించినట్లుగానే లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి రోజున… 300కు పైగా ఉన్న టార్గెట్ ను… ఇంగ్లాండ్ అవలీలగా చేదించగా… టీమ్ ఇండియా మాత్రం చెత్త ప్రదర్శనతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే 1-0 తేడాతో ఐదు టెస్టుల సిరీస్ లో ముందంజలోకి వెళ్ళింది ఇంగ్లాండ్ జట్టు. అటు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇలాంటి సీనియర్లు లేక… గిల్ చెత్త కెప్టెన్సీ కారణంగా.. మరో టెస్ట్ లో దారుణంగా ఓడిపోయింది టీమిండియా.
Also Read: Team India: ఆ ముగ్గురు హీరోయిన్లతో బరితెగించి తిరిగిన టీమిండియా ప్లేయర్…?
148 సంవత్సరాల చెత్త రికార్డు నమోదు చేసుకున్న టీమిండియా
లీడ్స్ వెనుకగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. సింపుల్గా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో.. చిత్తుచిత్తు అయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక్క మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసి కూడా ఓడిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 1877 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ ప్రారంభం కాగా… ఈ 148 సంవత్సరాలలో ఏ జట్టు కూడా ఇలా ఐదు సెంచరీలు చేసి ఓటమి పాలు కాలేదు. ఈ మ్యాచ్ లో…. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్ ఒక్కో సెంచరీ చేసి.. జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ కలిసి ఈ మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసినప్పటికీ… టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోని 148 సంవత్సరాల్లో.. ఐదు శతకాలు చేసిన కూడా ఓడిపోయినట్టుగా టీమిండియా సరికొత్త చెత్త రికార్డుకు నమోదు చేసుకుంది.
యశస్వి జైస్వాల్ మింగిన నాలుగు క్యాచ్ లు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్… చెత్త ఫీల్డింగ్ తో టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చాడు. ఈ మొత్తం మ్యాచ్ లో 4 క్యాచ్లు వదిలేసాడు యశస్వి జైష్వాల్. ఈ దెబ్బకు.. బతికిపోయిన ఇంగ్లాండ్ క్రికెటర్లు సెంచరీలు అలాగే హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. అలా దాదాపు 200 పరుగులు అదనంగా వచ్చాయి. ఆ అదనంగా పరుగులు రాకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది.
ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం
లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 471 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 465 పరుగులు చేయగా…. రెండవ ఇన్నింగ్స్ లో 373 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్ జట్టు.
Also Read: Thaman Hitters Hyderabad: అశ్విన్ సెంచరీ…తమన్ 10 బౌండరీలతో అరాచకం.. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ
— Out Of Context Cricket (@GemsOfCricket) June 24, 2025