Sleeping Problems: నేటి బిజీ లైఫ్ లో.. నిద్ర లేమి సమస్య సర్వ సాధారణంగా మారింది. చాలా మంది రాత్రి పడుకున్న తర్వాత మేల్కొనే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మన ఉత్పాదకత, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట మీ నిద్రకు పదే పదే అంతరాయం కలిగితే.. ఈ పరిస్థితి అలసట, చిరాకు కలిగించడమే కాకుండా.. అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
తరచుగా మెలకువ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, మారిన జీవనశైలి, అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ వాడకం, ఆహారపు అలవాట్లు వీటిలో ప్రధానమైనవి. ఆలస్యంగా భోజనం చేయడం లేదా అధికంగా భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. సరి కాని సమయాల్లో వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే వ్యాయామం శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుండి వెలువడే నీలి కాంతి నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
నిద్ర పట్టకపోతే ఏం చేయాలి ?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు సమయానికి నిద్ర పోలేకపోతే మంచం మీద ఎక్కువ సమయం అలాగే పడుకునే బదులు లేచి కొన్ని తేలిక పాటి పనులు చేయండి. పుస్తకాన్ని చదవండి. లేదా పజిల్ పూర్తి చేయండి. ఆడియో బుక్ వినడం వల్ల కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. . ఈ పనులు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
నిద్రలేమికి కారణాలు, చికిత్స :
రాత్రిపూట తినడం :
రాత్రిపూట ఆలస్యంగా లేదా ఎక్కువగా ఆహారం తీసుకున్నా కూడా నిద్రపై చెడు ప్రభావం చూపుతుంది. రాత్రి భోజనానికి.. నిద్రకు మధ్య కనీసం 2-3 గంటల వ్యవధి ఉండాలి. తేలికైన, పోషకమైన ఆహారం నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా కెఫీన్ , ఆల్కహాల్ వంటి పదార్థాలు కూడా మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండాలి.
Also Read: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఫ్రూట్ సలాడ్ తింటే.. ?
మొబైల్ ఫోన్ నుండి దూరం:
పడుకున్న తర్వాత మొబైల్ ఫోన్ వాడటం నిద్రకు అతిపెద్ద శత్రువు. సోషల్ మీడియా, ఈ మెయిల్స్ లేదా మెసేజ్‌లను తరచుగా చేసే అలవాటు నిద్రను ప్రభావితం చేస్తుంది. నిద్రపోవడానికి కనీసం గంట ముందు మొబైల్ ఫోన్ వాడకాన్ని ఆపాలి. అవసరమైతే.. ఫోన్‌ను బెడ్‌రూమ్ బయట ఉంచండి.
వ్యాయామం:
వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ దాని సమయం నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. సాయంత్రం లేదా రాత్రి పూట భారీ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఇది నిద్ర పోవడంలో సమస్యలను కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామం ఉదయం లేదా మధ్యాహ్నం తప్పకుండా చేయాలి. మీరు సాయంత్రం వ్యాయామం చేయాలనుకుంటే.. తేలిక పాటి వ్యాయామం చేయడం మంచిది.