Allu Arjun in Single Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాత విభిన్నమైన కథను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ముఖ్యంగా తనను తాను డిఫరెంట్ గా మలుచుకుంటూ ముందుకు వెళ్లాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్టార్టింగ్ కెరియర్ లోఎంతగా సపోర్ట్ చేశారో చెప్తూ వచ్చేవాడు. ఇ తరుణంలో సపరేట్ గా అల్లు అర్జున్ కు కూడా ఫ్యాన్స్ ఏర్పాటు అయ్యారు. అల్లు అర్జున్ కు సెపరేట్ ఫ్యాన్ వేసి వచ్చిన తర్వాత ఆటిట్యూడ్ లో కొద్దిపాటి మార్పులు వచ్చాయని కొంతమంది అంటూ ఉంటారు. కొన్ని అల్లు అర్జున్ స్పీచెస్ చూస్తుంటే ఇది కూడా నిజమే అనిపిస్తుంది. సరైనోడు సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్ ఆర్మీ అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు.
పుష్ప క్రేజ్ పనికి వచ్చింది
అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేసినా కూడా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయిపోయిన తరుణంలో, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా చాలామంది క్రికెటర్స్, పొలిటిషియన్స్ ఈ సినిమాలోని డైలాగ్స్ ను విపరీతంగా చెప్పటం వల్ల మంచి గుర్తింపు లభించింది. ఏకంగా నేషనల్ అవార్డు వరించింది. పుష్పకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. లేకపోతే ఈ క్రేజ్ ను చాలామంది వాడుకోవడం మొదలుపెట్టారు. పుష్ప రాజుల రియల్ లైఫ్ లో గెటప్స్ వేసుకొని డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఇది సినిమాల వరకు పాకింది.
అన్ని అల్లు అర్జున్ రిఫరెన్సెస్
ఇక అల్లు అర్జున్ తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రి నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై సింగిల్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా టాక్ సంపాదించుకుంది. శ్రీ విష్ణు కూడా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ రిఫరెన్సలను విపరీతంగా వాడారు. కేవలం ట్రైలర్ లో అల్లు అరవింద్ డాన్స్ మాత్రమే చూపించారు. కానీ సినిమాకు వచ్చేసరికి ఎక్కువగా అల్లు అర్జున్ రిఫరెన్సులు కనిపించాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ప్రొడ్యూసర్ మీరే అయితే.. సొంత డబ్బ కొట్టేసుకుంటారా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.