Viral Video: ఎక్కడైనా మనిషి చోరీలు చేయడం మనం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు కొత్త రకం చోరీకు వెలుగులోకి వస్తున్నాయి. ఔను, ఇలాంటి చోరీ కనీవినీ ఎరుగరు. ఇంతకు ఇక్కడ చోరీలకు పాల్పడేది ఎవరో అనుకుంటే పొరపాటే.. ఒక పక్షి నిర్వాకం ఇది. ఇంతకు పక్షి ఏంటి? చోరీ ఏంటి? అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవండి.
అన్ని పక్షులలో.. ఈ పక్షి వేరయా
మనుషుల కంటే పక్షులకు తెలివి ఎక్కువే. అయితే అంతటి తెలివి గల పక్షులు చాలా అరుదుగా మన కంట పడుతుంటాయి. అలాంటి పక్షి జాతి చెందిన ఈ పక్షి చేసే చేష్టలు మామూలువి కాదు. ముందు ఆ పక్షి జాతి పేరు తెలుసుకుందామా.. అదే మ్యాగ్ పై (Magpie). ఈ పక్షి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి పక్షి ఇది.
పెద్ద దొంగ..
ఈ మ్యాగ్ పై పక్షి జాతి చాలా అరుదు. ఈ పక్షి చూసేందుకు మూడు రంగులు కలిగి ఉంటుంది. నల్ల, తెలుపు, కొన్నిసార్లు నీలం మెరిసే రంగులలో ఈ పక్షి కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షుల్లో ఇదొకటి. సాధారణంగా తన ప్రతిబింబాన్ని కనుగొనగల తెలివి దీని సొంతం. అయితే దీనికి మరొక అలవాటు ఉంది. అదే చోరీలకు పాల్పడడం. సాధ్యమైన పరిస్థితుల్లో చిన్న గాడ్జెట్లు, చెర్రీలు దొంగిలించడంలో కూడా ఈ పక్షికి ప్రత్యేక స్థానమే.
ఎక్కడ ఉంటుంది?
ఈ జాతి పక్షులు ఎక్కువగా యూరోప్, ఆసియా, ఉత్తరాఫ్రికా, ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా చెట్లతో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో, కొన్నిసార్లు పట్టణాల దగ్గర కూడా కనిపిస్తుంది. పురుగులు, గూళ్లు, చిన్న పక్షులు, గింజలు, ఫలాలు మొదలైనవి తింటుంది.
డబ్బులు చోరీ..
అసలే దొంగతనం అలవాటు గల ఈ మ్యాగీపై పక్షి ఓ వ్యక్తి వద్ద డబ్బులు చోరీ చేసింది. ఇదేదో ట్రైనింగ్ ఇచ్చి మరీ చోరీలకు పాల్పడే రీతిలో ఈ పక్షి చోరీ చేసిందంటే నమ్మబుద్ధి కాదు. ఎట్టకేలకు డబ్బులు చోరీ చేసిన ఈ పక్షి వద్ద, సదరు వ్యక్తి డబ్బు లాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ పక్షి మాత్రం మాట వినలేదు. అందుకని మనోడు ఒక పురుగు ఆహారంగా వేస్తానని ఆశ చూపించాడు. అసలే దొంగ బుద్ధి గల పక్షి, నోటితో డబ్బును జారవిడిచి, వెంటనే ఆ పురుగును, నోటును పట్టుకొని తుర్రుమంటూ ఎగిరిపోయింది. అబ్బ, భలే దెబ్బ కొట్టావు కదే అంటూ మనోడు నివ్వెర పోయాడు. ఇలా ఈ పక్షి దొంగ బుద్ధికి మనోడు షాక్.
Also Read: బెల్లం మంచిదని తింటున్నారా? అయ్య బాబోయ్..
వీడియో వైరల్..
మ్యాగీపై జాతి పక్షి డబ్బులు తీసుకొని, పురుగును పట్టుకొని మోసం చేసిన తీరును సదరు వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ, చూశారా మనుషులే కాదు, పక్షులు తెలివి మితిమీరి పోయాయని చెప్పుకొచ్చాడు. ఎంతైనా మనిషి పాల్పడే మోసాల కంటే ఈ పక్షి చేసిన మోసం అంత పెద్దది కాదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
«Dude got scammed by a magpie»pic.twitter.com/0WprMM8B4G
— Massimo (@Rainmaker1973) May 9, 2025