AP Govt Scheme: సంక్షేమంపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద కార్మికుల కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కార్మికులు ప్రమాదాల్లో చనిపోతుండటంతో వారి కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఉపాధి హామీ కార్మికులకు బీమా పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది కూటమి సర్కార్.అన్నట్లుగా చకచకా అడుగులు వేస్తోంది.
ఏపీలో ఉపాధి కూలీలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఉపాధిని మాత్రమే నమ్ముకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదవశాత్తు మరణించినా, వికలాంగులైనా పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గతంలో కార్మికులకున్న రూ.50 వేల పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచింది. తల్లిదండ్రులకు ఈ పరిహారం పెంచింది. ఈ మేరకు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది.
కార్మికులకు ప్రత్యేకంగా
ఉపాధి కార్మికుల బీమా పథకాలు అమలు చేసినా కొద్దిమంది మాత్రమే ఉపయోగించుకునేవారు. ఇప్పుడు అందరికీ బీమా వర్తింపజేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీనికోసం కార్మికులు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా తెరిచి ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. బీమా పథకం ఉంటే దురదృష్టవశాత్తు మరణించినా, అనుకోకుండా ప్రమాదాల బారినపడి అంగవైకల్యం సంభవించినా ఆర్థికంగా సాయం కార్మికుల కుటుంబాలకు అందుతుంది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన-PMSBY, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన -PMJJBY పథకాలను అమలు చేస్తోంది. సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన-RSBY స్కీమ్‌ల ద్వారా ప్రతి కార్మికుడికి లబ్ధి చేకూరుతుంది.
ALSO READ: కోట్ల మంది పేదల సొంతింటి కలను నెరవేర్చిన అనికేతుడు
సురక్ష బీమా యోజన స్కీమ్ కింద 18-70 సంవత్సరాల మధ్య వయస్సువారు అర్హులు. ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే చాలు.అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు పరిహారం అందజేస్తుంది ప్రభుత్వం. పాక్షిక వైకల్యానికి రూ.లక్ష చెల్లిస్తారు.
కుటుంబానికి ఇబ్బందుల్లేకుండా..
జీవనజ్యోతి బీమా యోజన స్కీమ్ విషయానికి వద్దాం. 10-50 సంవత్సరాల మధ్య వయస్సు వారికి మాత్రమే. కాకపోతే ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ మరణిస్తే రూ.2 లక్షల పరిహారం ఇవ్వనుంది. ఇది కుటుంబంలో పెద్దకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ కుటుంబ పెద్ద చనిపోతే రెండు పథకాల ద్వారా కలిపి రూ.4 లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంది.
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన-RSBY ఇదీ కూడా కేంద్రప్రభుత్వ పథకం. దీనివల్ల పేద కుటుంబాలకు ఆరోగ్య బీమాను రానుంది. ఈ పథకం ద్వారా కుటుంబానికి ఏడాది రూ. 30,000 వరకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చు చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను సేకరించడానికి రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడానికి జిల్లా స్థాయి బృందాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు.