Pawan Kalyan PM Modi| ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాన్నిహిత్యం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపత్యంలో పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ప్రధాని మోడీని పరమ శివుడితో పోలుస్తూ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి మోడీకి అనికేత్ అని పేరు పెట్టారు.
‘అనికేత్’ అనే పేరు ఒక వ్యక్తిని సూచించడమే కాకుండా, ఒక సంకల్పాన్ని కూడా సూచిస్తుందని అన్నారు. గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సన్యాస జీవితం గడిపిన సమయంలో ఆయనకు ‘అనికేత్’ అనే పేరుతో పిలిచేవారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ ఈ పదం విశేషణ గురించి వివరిస్తూ.. ‘అనికేత్’ అంటే ఇల్లు లేని వాడని అర్థం. ఇది కేవలం భౌతిక ఇల్లు లేకపోవడాన్ని మాత్రమే సూచించదు, ఒక తాత్విక భావనను కూడా సూచిస్తుంది. ‘అనికేత్’ అనేది సృష్టిలో శాశ్వత సన్యాసిగా భావించే పరమశివుడికి కూడా పేరు. ఆయనకు విశ్వంలోని ప్రతి కణం ఒక ఇల్లు అయినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా సొంత ఇల్లు లేదు. అదే విధంగా.. నరేంద్ర మోడీకి కూడా తనకంటూ సొంత ఇల్లు లేకపోయినా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాదిమందికి ఇళ్లను అందించారని పవన్ తన ట్వీట్ లో కొనియాడారు.
“अनिकेत” – एक नाम, एक संकल्प।
मठवासी जीवन के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को 'अनिकेत' कहा गया, जिसका अर्थ होता है- 'बिना घर का'।
'अनिकेत' भगवान शिव का भी एक नाम है, जो सृष्टि के शाश्वत संन्यासी हैं; ब्रह्मांड का कण-कण जिनका घर है, और फिर भी उनका अपना कोई घर… pic.twitter.com/mrMhTHkFJ5
— Pawan Kalyan (@PawanKalyan) May 8, 2025
ఇటీవల ప్రధాని మోడీ అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఆయన తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని మోడీకి ‘అనికేత్’ అనే పేరు ఎలా వచ్చింది అనే అంశాన్ని వెల్లడించారు. మోడీ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు ‘అనికేత్’ అనే పేరు పెట్టారని చెప్పారు. ఈ పేరు పరమశివుడిని గుర్తుచేస్తుందని, ఆయన స్ఫూర్తితో ప్రధాని మోదీ కూడా తనకంటూ ఒక ఇల్లు లేకుండా దేశంలోని 140 కోట్ల ప్రజల్ని తన కుటుంబంగా భావించి సేవ చేస్తున్నారని పవన్ వివరించారు.
Also Read: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. తెలంగాణలో కేసు నమోదు
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో వైసీపీ పాలనలో రైతులు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నిత సమయంలో కూడా ప్రధాని మోడీ అమరావతికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇంతగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రసంగానికి ప్రధాని మోడీ ఎంతో ఆకర్షితులయ్యారు. ఆయనకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసునని వింతగా చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. అంతేకాకుండా, ఆయనను దగ్గరకు పిలిచి స్వయంగా చాక్లెట్ ఇచ్చారు. ఈ హృద్యమైన క్షణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.