BigTV English

Uses of Mango: మామిడి పండు ఇలా తిన్నారంటే.. జబర్దస్త్ ఉంటది

Uses of Mango: మామిడి పండు ఇలా తిన్నారంటే.. జబర్దస్త్ ఉంటది

Uses of Mnago: వేసవిలో రుచికరమైన, చల్లని మామిడి పండు తింటుంటే వచ్చే కిక్కే వేరు.. దీన్ని ఆస్వాదించడానికి చాలా మంది సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఎంతో రుచిగా ఉండే మామిడి పండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మామిడి పండులో ఉండే పోషకాలు ఇన్ని అన్ని కావు అనేకం.. దీనిని తినడం వల్ల విటమిన్ A, C, E, B, ఫోలేట్, కాపర్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి, కంటిచూపును మెరుగుపరుస్తాయి, మరియు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


మామిడిలో పండులో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యం నుంచి రక్షిస్తాయి. మామిడి పండ్లలోని ఫైబర్, సహజ పదార్థాలు ఉన్నాయి, ఇవి ఆహారంలోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయగలవు. దీంతో జీర్ణక్రియ బాగుంటుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది


మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గి్స్తుంది. దీనిలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో, గుండె జబ్బుల సంభావ్యతను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా దీనిలో నేచురల్‌ షుగర్స్‌ ఉన్నప్పటికీ, మామిడిపండ్లు మధుమేహం రావడానికి కారణం కావు. మధుమేహం రోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులను కలిగించవు. వాస్తవానికి 12 వారాల పాటు రోజువారీ ఆహారంలో 10 గ్రాముల ఫ్రీజ్-డ్రైడ్‌ మామిడిని తీసుకోవడం వల్ల రక్తంలో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరిగాయని ఓ అధ్యయనం పేర్కొంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది

మామిడిలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, మార్నింగ్ సిక్‌నెస్ వంటి జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే చిగుళ్ళ సమస్యల్ని దూరం చేస్తుందంటున్నారు. ఇందులో ఉండే మాంగిఫెరిన్ కంటెంట్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఫ్యాటీ యాసిడ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.

అధిక బరువును తగ్గిస్తుంది

మామిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, తద్వారా మీరు తక్కువ తింటారు, బరువు తగ్గుతారు. భోజనం తినే ముందు మామిడి పండు తినడం వల్ల తర్వాత ఎక్కువగా భోజనం తీసుకోకుండా ఉంటారు. అతిగా తినడం నివారించడానికి ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో తేలికగా బరువు తగ్గడానికి వీలవుతుంది.

ఎలా తినాలి..

చాలా మంది మామిడి పండ్లను చల్లగా తినాలని అనుకుంటారు.. అందుకు మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. అవి పాడవకుండా ఎక్కువ కాలం ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటారు. వాటిని తినే ముందు బయటకు తీసి తింటారు. కానీ అది నిజానికి సరైన పద్ధతి కాదు అంటున్నారు వైద్యులు. మార్కెట్ నుంచి మామిడి పండ్లు తీసుకురాగానే వాటిని శుభ్రంగా కడగాలి. ఒకవేల తెచ్చిన వెంటనే తినాలి అనుకుంటే ఒక పాత్రలో వాటిని ఒక 30 నిమిషాలు నీరు పోసి వాటిని నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోని తినాలి. ఒకవేళ మామిడి పండు చల్లగా తినాలనుకుంటే వాటిని చల్లటి నీటిలో నానబెట్టుకొని తినవచ్చు.

Also Read: మాంసాహారాన్ని తలదన్నే.. శాకాహారం.. ఏంటి అనుకుంటున్నారా..?

మామిడి పండు తిన్న తర్వాత..

మామిడి పండు తిన్న తర్వాత కొన్ని ఆహారాలకు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
. మామిడి పండు తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
. పొగ త్రాగడం లేదా మద్యం సేవించడం వంటివి చేయకూడదు.
. పాల ఉత్పత్తులను తీసుకుంటే డయాబెటిస్, కడుపు అసౌకర్యం మరియు జీర్ణసమస్యలను కలిగించవచ్చు.
. అలాగు ఇతర పండ్లను తీసుకోకుడదు.
. మామిడి తిన్న తర్వాత 30 నుండి 1గంట వరకు శారీరక వ్యాయామా వంటివి చేయకూడదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×