AP Scheme: ఏపీలో మరో కొత్త స్కీమ్ రాబోతోంది. అది కూడ ఒక్క రూపాయి చెల్లించకుండ, ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య కుటుంబాలకు భరోసాను ఇస్తుందని చెప్పవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ఇంతకు ఆ హామీ ఏమిటి? అసలు ఏంటి ఈ పథకం తెలుసుకుందాం.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి రాగానే పింఛన్ పెంపు, రహదారుల అభివృద్ది, వరదసాయం, ఇలా ఒక్కొక్కటి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ప్రతి కుటుంబానికి భీమా సౌకర్యం అవసరం. భీమా ఉంటేనే ధీమా ఉంటుందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంటుంది. అందుకు చాలా వరకు ఎన్నో కుటుంబాలు నెలనెలా ప్రీమియంలు చెల్లిస్తూ, భీమా పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి.
కొన్ని కుటుంబాలు ఆ ప్రీమియంలు చెల్లించే స్థోమత లేక, భీమా సౌకర్యానికి దూరమవుతున్నారని చెప్పవచ్చు. దీనితో కుటుంబ యజమాని మృతి చెందితే, ఆ ఇంట అష్టకష్టాలు వెంటాడే పరిస్థితి. అదే భీమా సౌకర్యం ఉంటే, ఆ కుటుంబానికి ధీమా సాధ్యం. అందుకే ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఆరోగ్య భీమా కల్పించే పథకానికి శ్రీకారం చుట్టనుంది.
ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదికూడ 1 కోటి 43 లక్షల పేద కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పించడమే పథక ప్రధాన లక్ష్యం. అయితే సామాన్య కుటుంబాలు ఒక్క రూపాయి కూడ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదట. ప్రతి కుటుంబానికి రూ. 2500 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది.
Also Read: Kakinada Port Case: ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?
ఈ పథకం అమలైతే ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వం తరపున ధీమా కల్పించినట్లేనని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్న పథకం వివరాలు కావాలంటే, గ్రామ సచివాలయాన్ని ఓసారి సందర్శించండి!