WhatsApp Pay: ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్ సర్వీస్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. గతంలోనే వాట్సాప్ పే ప్రారంభం కాగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూజర్ లిమిట్స్ విధించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ పే సేవలు పరిమితంగా ఉండేవి. ఇప్పుడు ఆ లిమిట్స్ ను తొలగించడంతో వాట్సాప్ పే సేవలను అందరూ ఉపయోగించుకునే అవకాశం కలిగింది.
గతంలో 100 మిలియన్ల మందికే పరిమితం
గడిచిన రెండు సంవత్సరాలుగా ఇండియాలో వాట్సాప్ పే అనేది గరిష్టంగా 100 మిలియన్లకే పరిమితం చేసింది NPCI. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లు అందరికీ ఈ సేవలు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఆ ఆంక్షలను తొలగిస్తున్నట్లు NPCI వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ పే సర్వీసును యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపై వాట్సాప్ వినియోగదారులు ఈ యాప్ ద్వారా నేరుగా డబ్బులు పంపడంతో పాటు పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం మాదిరిగానే వాట్సాప్ పే ద్వారా డబ్బులు పంపుకునే అవకాశం ఉంటుంది. డబ్బు పంపడంతో పాటు పొందవచ్చు. ఒక్కోసారి మనీ రిక్వెస్ట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఇండియన్స్ ఇకపై ఈ దేశాల్లోనూ ఈజీగా UPI పేమెంట్స్ చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?
వాట్సాప్ ద్వారా డబ్బులు ఎలా పంపుకోవాలంటే?
వాట్సాప్ ద్వారా డబ్బులు పంపడంతో పాటు రిసీవ్ చేసుకోవాలంటే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి? ఎలా చేసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం..
⦿ ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి.
⦿ రైట్ సైట్ పైన ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేయాలి.
⦿ యువర్ పేమెంట్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
⦿ యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆన్షన్ ను ఎంచుకోవాలి.
⦿ పేమెంట్స్ కండీషన్స్ ను అంగీకరించాలి. ఆ తర్వాత యాక్సెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ ఇక మీరు డబ్బులు పంపించాలి అనుకున్న వ్యక్తితో వాట్సాప్ చాట్ మొదలు పెట్టాలి.
⦿ కింద రైట్ కార్నర్ లో ఉన్న రూపీ సింబల్ ను క్లిక్ చేయాలి.
⦿ ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
⦿ డబ్బులు పంపేందుకు అంగీకరించేందుకు గాను యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
⦿ మెసేజ్ ద్వారానే మనీ పేమెంట్ అనేది కన్ఫార్మ్ అవుతుంది.
మొత్తంగా ఇతర యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు ఎలా పంపుకుంటారు. వాట్సాప్ పే ద్వారా కూడా అలాగే పంపుకునే అవకాశం ఉంటుంది. సో.. ఇకపై వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపుకోవడంతో పాటు కాల్స్ చేసుకోవచ్చు. పనిలో పనిగా డబ్బులు కూడా పంపుకునే అవకాశం ఉంటుంది.