Gautham Vasudev Menon: టాలీవుడ్ లో హిట్ కాంబోస్ ఎలా అయితే ఉంటాయో.. కోలీవుడ్ లో కూడా కొన్ని హిట్ కాంబోస్ ఉంటాయి. అలా కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో అంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్- సూర్య అని చెప్పాలి. అసలు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేసిన సినిమాల వలన ఎన్ని జంటలు పెళ్లి చేసుకున్నాయో తెలుసా.. ? అందులో సూర్య – జ్యోతిక కూడా ఒక జంట. వీరిద్దరి మొదటి చిత్రం కాఖా కాఖా. అదేనండీ తెలుగులో వెంకటేష్ – ఆసిన్ నటించిన ఘర్షణ సినిమా. దాని ఒరిజినల్ సినిమానే కాఖా కాఖా. ఈ సినిమానే తెలుగులో ఘర్షణగా తెరకెక్కించారు. తెలుగులో అంతగా హిట్ అవ్వకపోయినా .. తమిళ్ లో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పరిచయమైన సూర్య – జ్యోతిక ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నారు.
ఇక ఇలాంటిదే తెలుగులో ఏ మాయ చేసావే సినిమా సమయంలో జరిగింది. అక్కినేని నాగ చైతన్య- సమంత ఆ సినిమాలో పరిచయమయ్యారు. ఆ తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే ఇప్పుడు విడిపోయారు అనుకోండి.. అది వేరే విషయం. కానీ, వీరిద్దరి పెళ్లి అప్పుడు గౌతమ్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా మారింది. ఆయన ఫోటోను చై , సూర్య దేవుడి గదిలో పెట్టుకోవాలని మీమ్స్ చేశారు.
ఇక గౌతమ్ కి సూర్యకు మంచి స్నేహ బంధం ఉంది. వీరి కాంబోలో రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ఒకటి కాఖా కాఖా అయితే ఇంకొకటి సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత ఫేవరెటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి సూర్య.. గౌతమ్ సినిమాకు నో చెప్పాడట. దీనికి గౌతమ్ వాసుదేవ్ చాలా ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగుతున్న ఆయన ఈ మధ్య విశాల్ నటించిన మదగజరాజ సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Akash Jagannadh: పూరి కొడుకు మంచి మనసు.. పావలా శ్యామలకు రూ.లక్ష ఆర్థికసాయం
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో గౌతమ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు . ఆ ఇంటర్వ్యూలో ఆయన ధృవ నక్షత్రం సినిమా గురించి మాట్లాడం హైలైట్ గా మారింది. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏడేళ్లుగా విడుదలకు నోచుకోలేకపోయింది. ఎన్నిసార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. అది థియేటర్ వద్దకు మాత్రం చేరలేకపోయింది. తాజాగా ఆ సినిమా గురించి గౌతమ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
“ధృవ నక్షత్రం సినిమా ముందు నేను చాలా హీరోలకు చెప్పాను. కొన్ని అనివార్య కారణాల వలన వారు చేయలేము అని చెప్పారు. వారి పరిస్థితిని నేను అర్ధం చేసుకున్నాను. ఈ కథనే నేను సూర్యకు వినిపించాను. కానీ, సూర్య నా కథను రిజెక్ట్ చేశాడు. మిగతావాళ్ళు రిజెక్ట్ చేసినా ఏం అనిపించలేదు కానీ, సూర్య అలా అనేసరికి తట్టుకోలేకపోయా. చాలా బాధ అనిపించింది” అని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా ధృవ నక్షత్రానికి సరైన హీరోనే ఎంచుకున్నాడు గౌతమ్. విక్రమ్ ఆ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యాడు. మరి ఈ సినిమా ఎప్పటికీ రిలీజ్ అవుతుందో చూడాలి.