BigTV English

Anantapur Rains: అనంతకు అకాల వర్షాలు.. ఉగ్ర రూపం దాల్చిన పండమేరు వాగు, నీట మునిగిన కాలనీలు

Anantapur Rains: అనంతకు అకాల వర్షాలు.. ఉగ్ర రూపం దాల్చిన పండమేరు వాగు, నీట మునిగిన కాలనీలు

Anantapur Rains: ఏపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అకాల వర్షాలు. మొన్నటి వరదల్లో విజయవాడ నగరం అతలాకుతలం కాగా, ఇప్పుడు అనంతపురం జిల్లా వంతైంది. పండమేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో అనంతపురంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆకస్మిక వరదలు వెంటాడుతున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కీలకంగా మారిన పండమేరు వాగు ఉధృతంగా పొంగుతోంది. దీనికి ఇరువైపులా ఉన్న కాలనీలు నీటిలో మునిగిపోయాయి.

అర్థరాత్రి సమయంలో వరద నీరు ముంచెత్తడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. దీంతో మరోవైపు పుట్టపర్తిలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చామని బాధితులు చెబుతున్నారు.


పండమేరు వాగు చరిత్రలో కనివినీ ఎరుగని స్థాయిలో వరద వచ్చింది. దీని ప్రభావం రాప్తాడు, అనంతపురం అర్బన్ ప్రాంతాల చెరువుకు నీటి అందిస్తుంది. నార్మల్‌గా అయితే పండమేరుకు ఈ స్థాయిలో వరద రాలేదని అంటున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద వచ్చిందని అంటున్నారు.

ALSO READ: ఆస్తుల మొత్తమెంత? చిక్కంతా వాటాల దగ్గరే.. రెండా, మూడా?

వరద విషయం తెలియగానే అధికారులు, రెస్య్కూ, ఫైర్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇళ్లలో ఎవరైనా చిక్కుకున్నారా అనేదానిపై ఆరా తీస్తున్నారు. వరద ప్రవాహానికి సర్వం కోల్పోయామని బాధితుల ఆవేదన.

రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి భారీ వర్షం పడింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనగానపల్లి చెరువుకు గండి పడింది. దీంతో వేలాది ఎకరాల పంటలకు భారీ నష్టం వాటిల్లింది.

రామగిరి-ఎన్‌ఎస్‌ రేట్‌, ముత్తవకుంట్ల – కనగానపల్లి, తరగకుంట-కనగానపల్లి రహదారులన్నీ జలమయమయ్యాయి. మరోవైపు వరద మునిగిన ప్రాంతాల్లో మాజీ మంత్రి పరిటాల సునీత పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×