BigTV English

AP High Court Orders Status Quo: అప్పటి వరకూ ఆపండి.. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో..

AP High Court Orders Status Quo: అప్పటి వరకూ ఆపండి.. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో..

AP High Court Status Quo on Demolition: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటివరకు స్టేటస్ కో విధిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ కార్యాలయాలను రేపటి వరకు యథాతథంగా ఉంచాలంటూ ఆ ఆదేశాలలో పేర్కొంది. పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ ను దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే.. ఏపీలో మొత్తం 10 జిల్లాల వైసీపీ కార్యాలయాలకు సంబంధించి పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనిపై హైకోర్టు రేపు మరోసారి విచారణ జరపనుంది.


Also Read: జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గు చేటు: ఎమ్మెల్యే మాధవి

ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీలో అనేక చోట్ల వైసీపీ కార్యాలయాలను అక్రమంగా నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశమైంది. ఆ తరువాత వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులకు సైతం అక్కడి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయా ఆఫీసులను సైతం కూల్చివేస్తారా..? అన్న అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.


Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×