BigTV English

Julian Assange Freedom: 14 ఏళ్ల తర్వాత అంసాజేకు స్వేచ్ఛ.. ఆస్ట్రేలియాకు పయనం!

Julian Assange Freedom: 14 ఏళ్ల తర్వాత అంసాజేకు స్వేచ్ఛ.. ఆస్ట్రేలియాకు పయనం!

Wikileaks Founder Julian Assange: 14 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అంసాజేకు విముక్తి కలిగింది. అమెరికా సైనిక రహస్యాలను ప్రచురించడం ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న అసాంజేను విడిచిపెట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అంతకు ముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచార్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంసాజే అంగీకరించారు.


మిలటరీ రహస్య పత్రాలను రిలీజ్ చేసిన కేసులో అసాంజే అమెరికాతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరియానాదీవుల్లో ఉన్న కోర్టులో హాజరయ్యారు. కోర్టు విచారణ తర్వాత అసాంజే విముక్తి పొందారు. ఆయన స్వేచ్ఛగా కోర్టు నుంచి బయటకు వచ్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న న్యాయపోరాటం ముగిసింది. ఇన్నాళ్లు జైలులో ఉన్న అసాంజే.. మంగళవారం కోర్టులకు వెళ్లారు. అయితే అమెరికా కోర్టు అసాంజేకు ఎటువంటి శిక్ష విధించలేదు. దీంతో ఆయన తన సొంత దేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.

Also Read: చిచ్చురేపిన కొత్త ఆర్థిక బిల్లు.. కెన్యా పార్లమెంటు భవనానికి నిప్పు


మిలటరీ సమాచారాన్ని లీక్ చేసిన కేసులో అసాంజే లండన్ జైలులో శిక్ష అనుభవించారు. అయితే దేశ ద్రోహం కేసులో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అసాంజే కోర్టును ఆశ్రయించడు. బ్రిటన్ కేసులో అసాంజే శిక్ష అనుభవించారు. అంతకు ముందు ఈక్వడార్ ఎంబసీలో ఏడేళ్లు గడిపాడు. అసాంజే విడుదల పట్ల ఆయన భార్య స్టెల్లా సంతోషం వ్యక్తం చేశారు.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×