YSRCP : బోరుగడ్డ అనిల్. అది నోరు కాదు డ్రైనేజ్ అనేది టీడీపీ ఆరోపణ. నోటికొచ్చినట్టూ వాగాడు.. బూతులు మాట్లాడాడు.. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని అంటున్నారు. రాజకీయ విమర్శలు ఏ పార్టీలోనైనా కామనే. కానీ, బోరుగడ్డ తీరు మాత్రం దారుణం. తిట్లు, బూతులే అతని ఆయుధాలు. నాయకులను మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులను, ఇంట్లోని మహిళలనూ అసభ్య పదజాలంతో దూషించాడు. చివరాఖరికి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫ్యామిలీ మెంబర్స్‌పైనా నోటి దురుసు ప్రదర్శించాడు. పాపం పండాక.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. రెడ్ బుక్ ఓపెన్ చేసి.. ఫస్ట్ బోరుగడ్డ అనిల్‌తోనే యాక్షన్ మొదలు పెట్టారు. అరెస్ట్ చేసి.. రాజమండ్రి జైల్లో వేసి.. ఊచలు లెక్కబెట్టిస్తున్నారు.
ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్‌తో చిక్కులు
అయితే, ఎలాగైనా జైలు నుంచి బయటపడాలని బోరుగడ్డ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆ మధ్య తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత ఆ బెయిల్ కూడా రద్దై.. మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు. ఇక్కడే బోరుగడ్డ అనిల్ అతితెలివి ప్రదర్శించి.. కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడని తెలుస్తోంది. తన తల్లికి హెల్త్ బాలేదని అనిల్ హైకోర్టుకు సమర్పించిన డాక్టర్ సర్టిఫికెట్ ఫేక్ అని పోలీసులు అనుమానించారు. చెన్నైలోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంది. అతన్ని ఎంక్వైరీ చేస్తే.. ఆ సర్టిఫికెట్ తాను ఇవ్వలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయం పోలీసులు హైకోర్టుకు చెబితే.. బోరుగడ్డ బెయిల్ రద్దు అయింది. నకిలీ సర్టిఫికెట్ పెట్టి కోర్టును, పోలీసులను మోసం చేశారనే మరో కేసు కూడా అనిల్‌పై పెట్టారు.
బోరుగడ్డపై హైకోర్టు సీరియస్
లేటెస్ట్‌గా, మరోసారి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశాడు బోరుగడ్డ. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా అది సాధ్యపడలేదు. వేగంగా విచారించి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు లాయర్ రిక్వెస్ట్ చేయగా.. హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ నకిలీ సర్టిఫికెట్‌తో మోసం చేసిన కేసు విషయం తేలాకే.. బెయిల్ గురించి ఆలోచిస్తామని బోరుగడ్డ తరఫు న్యాయవాదికి తేల్చి చెప్పింది కోర్టు. ఈ సందర్భంగా అనిల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను చంపేసిన వ్యక్తి.. తాను అనాథనని.. బెయిల్ ఇవ్వమని కోరుతున్నట్టుగా ఉందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెబుతున్నారు.
Also Read : చెప్పులు పంపిన పవన్.. ఇప్పుడు చెప్పండ్రా?
బెయిల్ కోసం బోరుగడ్డ వేసిన ఎత్తుగడ ఇప్పుడాయనకే బూమరాంగ్ అయిందని అంటున్నారు. ఒక కేసు నుంచి బయటపడాలని చూస్తే.. ఇప్పుడు మరో కేసు ఆయన మెడకు చిక్కుకుందని.. ఇప్పట్లో బోరుగడ్డకు బెయిల్ రావడం కష్టమేనని తెలుస్తోంది.