BigTV English

Shankar Dada MBBS: చిరంజీవి నాన్నగారి కల నేటికీ నిజమైంది, వైద్య చరిత్రలోనే ఇది ఒక హఠాత్పరిణామం

Shankar Dada MBBS: చిరంజీవి నాన్నగారి కల నేటికీ నిజమైంది, వైద్య చరిత్రలోనే ఇది ఒక హఠాత్పరిణామం

Shankar Dada MBBS – Diabetes : కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఏవో ఒకటి నేర్పిస్తూ ఉంటాయి. తెలియని కొత్త విషయాన్ని చెబుతూ ఉంటాయి. ఆగిపోయిన జీవితాలను ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. సినిమా ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పిస్తుంది. అయితే అన్ని సినిమాలు అలా ఉంటాయని చెప్పలేము కొన్ని సినిమాలు మాత్రం అలా ఉంటాయి. సినిమాలు చూసి యాటిట్యూడ్ నేర్చుకునే కొంతమంది సినిమాలు చూసి ఎథిక్స్ ఎందుకు నేర్చుకోరా అర్థం కాని విషయం. సినిమాలు చూసి పాడు అయిపోతున్నారని చాలామంది తిడుతూ ఉంటారు. కానీ అవే సినిమాలు చూసి బాగుపడడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. సినిమా దర్శకులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు మన మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు చెప్పే కొన్ని కథలు ఇన్స్పైరింగ్గా తీసుకొని ఎంత దూరమైనా వెళ్లొచ్చు అని మర్చిపోకూడదు.


శంకర్ దాదా ఎంబిబిఎస్ ఎఫెక్ట్

శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూసిన ఒక అమ్మాయికు తను డయాగ్నోస్ అని తెలిసింది. తనకు టైపు 1 డయాబెటిస్ ఉంది అని తెలిసిందట. అది ఒక డాక్టర్ వలన కాదు, ఒక క్లినిక్ వలన కాదు, శంకర్ దాదా ఎంబిబిఎస్ వలన. ఈ విషయాన్ని నిజంగానే చెబుతున్నాను జోక్ చేయట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. తనకు తను తెలియకుండానే బరువు తగ్గిపోవడం, ఈ డాక్టర్ చూసిన కూడా తనకు ఏమైందని సరిగ్గా చెప్పలేకపోవడం. అలాంటి తరుణంలో ఒక రోజు సడన్ గా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూసిందట. దానిలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన కొన్ని సెంటెన్స్ బట్టి సినిమాను పాస్ చేసి వాళ్ళ పేరెంట్స్ కు చెప్పిందంట ఆ అమ్మాయి. వాళ్ల పేరెంట్స్ నవ్వినా కూడా ఆ తర్వాత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తర్వాత అమ్మాయి మామూలు మనిషి అయింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ చాలామంది మాత్రం రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


వైద్య చరిత్రలో ఇదొక హఠాత్పరిణామం

శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఒక హఠాత్ పరిణామం అంటూ చాలామంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది మాత్రం ఈమె మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అయి ఉండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ అమ్మాయి చెప్పడం మాత్రం మాది మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ అయినా కూడా ఒక సినిమా వలన నాకు ఉన్నది నేను కనిపెట్టగలిగాను అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.

Also Read : AA22xA6 : అట్లీ , అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అప్పుడే ప్లాన్ చేస్తున్నారు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×