Stomach Pain: ఎక్కువ బరువులు మోసినప్పుడు చాలా మందికి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. ఇలా జరగడం కామన్ కదా అని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఒత్తిడి కడుపు భాగంపై పడితే కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ బరువు మోసినపుడు కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో, అది శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
మనిషి ఏం చేసినా శరీరంలోని అన్ని భాగాలు కలిసి పనిచేస్తాయి. ఎక్కువ బరువు మోసినప్పుడు, కేవలం చేతులకే కాకుండా, నడుం, పేగులు, కడుపు మీద కూడా ఒత్తిడి పడుతుందట. ఆ సమయంలో కడుపులో ఉన్న అవయవాలు కూడా ఒత్తిడికి గురవుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువ బరువు మోసినప్పుడు, కడుపు మీద ఎక్కువగా ఎక్కువగా ఒత్తిడి పడుతుందట. దీంతో, కడుపులోని కొన్ని భాగాలపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని హెర్నియా అని పిలుస్తారట. దీన్ని లైట్ తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మొదట చిన్న నొప్పిగా మొదలై, తర్వాత తీవ్రమవుతుందని అంటున్నారు.
బరువు మోసినపుడు కడుపు చుట్టూ ఉన్న కండరాలు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల చాలా సార్లు కండరాలు గాయపడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మజిల్స్ స్ట్రెయిన్ అని పిలుస్తారట. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే ఇది తగ్గుతుందట. కానీ మళ్లీ నొప్పి ఎక్కువైతే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: AI, ChatGPT వల్ల ఆరోగ్య సమస్యలు..
ఎక్కువ బరువు మోస్తున్నపుడు కడుపులో ఒత్తిడి పెరగడం వల్ల పలు జీర్ణసమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్న తర్వాత అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చని అంటున్నారు. గాస్ట్రిక్ జ్యూస్ కడుపు పైకి రావడం వల్ల చాలా మందిలో అసిడ్ రిఫ్లక్స్ వచ్చే ప్రమాదం ఉందట. ఇది కూడా కడుపులో నొప్పికి కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఒకసారి కడుపులో ఒత్తిడి పెరిగితే, పేగుల కదలికలు మందగించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మలబద్దకం వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా తరచుగా కడుపులో నొప్పి వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ బరువులు మోసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువులు మోస్తున్నప్పుడు సరిగ్గా నిలబడడం, బ్యాక్ సపోర్ట్ ఉండేలా చూసుకోవడం వంటివి చేస్తే నొప్పి రాకుండా కొంతవరకైనా జాగ్రత్త పడే అవకాశం ఉందని అంటున్నారు.
బరువులు మోసేటప్పుడు ఎక్కువగా నొప్పి వస్తే పనిని ఆపి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బరువు మోసే పనులు తక్కువ చేయడం మంచిది. ముఖ్యంగా ఇప్పటికే కడుపు సమస్యలు ఉన్నవారు బరువులు మోస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కడుపు నొప్పి విపరీతంగా ఉందనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.