BigTV English

Agri Gold Lands Case: అగ్రిగోల్డ్ భూముల కేసు.. జోగి రాజీవ్ కు షాకిచ్చిన హైకోర్టు

Agri Gold Lands Case: అగ్రిగోల్డ్ భూముల కేసు.. జోగి రాజీవ్ కు షాకిచ్చిన హైకోర్టు

Agri Gold Lands Case: అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జోగి రాజీవ్, మండల సర్వేయర్‌కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజీవ్, రమేష్‌లను కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. రాజీవ్, రమేష్ బెయిల్ రద్దు చేయాలని ACB దాఖలు చేసిన పిటిషన్లు వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశిచింది. దీంతో అగ్రిగోల్డ్ భూముల కేసులో రాజీవ్ కు షాక్ తగిలినట్లైంది.


జోగి రాజీవ్ కు పర్సనల్ నోటీసులు అందించిన తర్వాత.. అతడిని కస్టడీకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం డీజీపీ ఆదేశాలు అందిన తర్వాత.. రేపు జోగి రమేష్ కు, సర్వేయర్ కు ఏసీబీ నోటీసులు అందించనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఏసీబీ పేర్కొననుంది. విచారణకు హాజరు కాని నేపథ్యంలో.. కోర్టు నుంచి విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: సొంతగూటికి శిద్దా రీ ఎంట్రీ? చంద్రబాబు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారా?


వారు విచారణకు హాజరు కాని నేపథ్యంలో.. కోర్టు ధిక్కరణ కింద బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని ఏసీబీ అధికారులు హైకోర్టును కోరే ఛాన్స్ ఉంది. మరి రాజీవ్, మండల సర్వేయర్ విచారణకు సహకరిస్తారో లేదోనన్నది చూడాలి.

ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ అధికారులు గతనెల 13న అరెస్ట్ చేశారు. ఒకే భూమిని విరివిగా పలువురికి అమ్మారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ2గా జోగి వెంకటేశ్వరరావు, ఏ3గా సర్వేయర్ రమేష్, ఏ4గా సర్వేయర్ దేదీప్య, ఏ6గా మండల సర్వేయర్ రమేష్, ఏ7గా డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్ ఉన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×