BigTV English

Home Minister Anitha: గంజాయి సమాచారం ఇచ్చేవారికి ప్రైజ్ మనీ ఇస్తాం: హోంమంత్రి అనిత

Home Minister Anitha: గంజాయి సమాచారం ఇచ్చేవారికి ప్రైజ్ మనీ ఇస్తాం: హోంమంత్రి అనిత

Home Minister Anitha latest news(AP news live): రాష్ట్రంలో గంజాయిని అరకట్టే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి నివారణకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని వెనుక గంజాయి ఉంటుందని ఆమె చెప్పారు. వినుకొండ ఘటన, అమ్మాయిలపై అఘాయిత్యాల వెనుక కల్తీ మద్యం లేదా గంజాయి ఉన్నట్లు తేలిందని హోంమంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్రతోని 5 జిల్లాల్లో గత ఐదేళ్ల నుంచి కూడా గంజాయి సాగు పెరిగిపోయిందన్నారు. నియంత్రణకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మొక్కుబడిగా కొన్ని చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారంతే అంటూ ఆమె ఆరోపించారు. పలువురు రాజకీయ నేతల సహకారంతో ఇదో వ్యాపారంలా సాగిందన్నారు.


Also Read: ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తున్నారా?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి సాగు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని కూడా వినియోగిస్తామన్నారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతామంటూ హోంమంత్రి పేర్కొన్నారు. ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. గంజాయిపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.


అదేవిధంగా గంజాయికి సంబంధించిన వివరాలను తెలియజేసిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. దీనిపై అన్ని జిల్లాల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో గంజాయి తీసుకునే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి, వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారని చెప్పారు. మహిళా భద్రతపై కూడా మరింత పటిష్టంగా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×