BigTV English

Justice Madan B Lokur: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్ నియామకం

Justice Madan B Lokur: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్ నియామకం

Justice Madan B Lokur: తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియమితులయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఈయనను నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, ఆ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా లోకూర్ పనిచేశారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోకూర్ ను కొత్త చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.


కాగా, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. కాగా, విచారణ జరుగుతున్న సమయంలో కమిషన్ ఏర్పాటు, దాని చైర్మన్ నిష్పాక్షితను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు


ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చండ్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ అందులో పేర్కొన్నది. అయితే, అదే సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ ను కొట్టేయాలంటూ కేసీఆర్ విన్నవించిన వినతిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు ఆయన సమర్పించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త చైర్మన్ ను నియామకం చేపడుతామన్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నేడు నూతన చైర్మన్ గా జస్టిస్ లోకూర్ ను నియమించింది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×