E-Paper
Advertisement

NKR-21 Climax: గూస్‌బంప్సే.. ఒక్క క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రూ.8 కోట్లు, 1000 మంది ఆర్టిస్టులు..!

NKR-21 Climax: గూస్‌బంప్సే.. ఒక్క క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రూ.8 కోట్లు, 1000 మంది ఆర్టిస్టులు..!

NKR21 Movie Climax Action Sequence: నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అయితే ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అతడు ఆ తర్వాత అలాంటి హిట్ కొట్టేందుకు ప్రయత్నించిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. అందులో డెవిల్ మూవీ ఒకటి. ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత తన లైనప్‌లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ‘NKR-21’ సినిమా ఒకటి. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ పవర్ ఫుల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇటీవల కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆ పోస్టర్‌లో కళ్యాణ్ మాస్ లుక్ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. పిడికిలి బిగించి అగ్గిని కూడా లెక్కచేయకుండా కూర్చున్న అతడి లుక్ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read: కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన కొత్త సినిమాల పోస్టర్లు..

అదే సమయంలో అతడి చుట్టూ ఉన్న గూండాలు కసితో అతడిని చూస్తున్న తీరు అదొక యాక్షన్ సీన్‌కు సంబంధించిన పోస్టర్‌లా అనిపించింది. ఆ పోస్టర్‌తో సినిమాకి బజ్ ఫుల్‌గా క్రియేట్ అయింది. ఆ లుక్‌లో కళ్యాణ్ రామ్‌ను మునుపెన్నడూ చూడలేదని అభిమానులు, సినీ ప్రియులు చెప్పుకొచ్చారు. దీంతో కల్యాణ్ రామ్ ఈ సారి గట్టి హిట్ కొట్టేస్తాడని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్లైమాక్స్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షూట్ కోసం ఏకంగా 30 రోజులు డేట్స్ కేటాయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఇంకా ఉంది. దాదాపు 1000 జూనియర్ ఆర్టిస్టులుతో ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. దీనికి రామకృష్ణ కొరియోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో అర్థం అవుతుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×