AP Inter Result 2025: ఎట్టకేలకు విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇదొక తీసి కబురు. వివిధ ఎంట్రన్స్ పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండేలా ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తోంది.
ఏప్రిల్ 12న అంటే శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్నారు మంత్రి లోకేష్. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు అధికారులు.
మార్చి 1 నుంచి 19వ వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. సెకండ్ సంవత్సరం పరీక్షలు మార్చి 3వ నుంచి 20వ వరకు జరిగాయి. దాదాపు పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్ సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా వెల్లడించనుంది. ఫలితాలు విడుదలైన తరువాత విద్యార్థులు వాట్సాప్ నెంబరు 9552300009 ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
ALSO READ: మళ్లీ గిల్లిన జగన్, టార్గెట్ అదే
పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ సేవలు అందిస్తోంది. ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలను వాట్సాప్ ద్వారానే విద్యార్థులు చూసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్ ఎంచుకోవాలి. డౌన్‌లోడ్ ఇంటర్ ఫలితాలు-2025 అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మార్కుల మెమో కోసం మీ హాల్ టికెట్ నెంబర్‌ను టైప్ చేయాలి. పీడీఎఫ్ రూపంలో మనకు ఫలితాలు కనిపిస్తాయి.
ఇంటర్ బోర్డు వెబ్ సైట్‌లో వెళ్లి ఫలితాల గురించి తెలుసుకోవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ లోకి వెళ్లాలి
ఇంటర్ ఫలితాలు-2025 లింక్‌పై బటన్ క్లిక్ చేయాలి
విద్యార్థి హాల్ టికెట్ నెంబర్‌తో పాటు వివరాలను నమోదు చేయాలి
సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు ఓపెన అవుతాయి.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్‌పై నొక్కి కాపీని పొందవచ్చు విద్యార్థులు.