BigTV English

YS Jagan : మళ్లీ గిల్లిన జగన్.. టార్గెట్ అదేనా?

YS Jagan : మళ్లీ గిల్లిన జగన్.. టార్గెట్ అదేనా?

YS Jagan : అంత రచ్చ అయింది. ఎస్సైతో మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. పోలీస్ అధికారుల సంఘంతో మాటలు పడాల్సి వచ్చింది. అయినా.. మాజీ సీఎం తగ్గేదేలే అంటున్నారు. నాలుగో సింహాలను గిల్లడం ఆపట్లేదు. రాప్తాడు కామెంట్ల కలకలం కొనసాగుతుండగానే.. లేటెస్ట్‌గా కర్నూలు పార్టీ శ్రేణుల మీటింగ్‌తో మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పోలీసులను కూటమి ప్రభుత్వం వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటోందని అన్నారు.


పోలీసులే ఎందుకు టార్గెట్?

జగన్ కావాలనే రచ్చ కంటిన్యూ చేస్తున్నారా? పోలీసులను అంటే ఏమొస్తుంది? బట్టలూడదీస్తా, ఉద్యోగాలు తీసేస్తా.. అని బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఎంగా చేసిన నేత.. ఓ ఎస్సైని టార్గెట్ చేసి తన స్థాయిని తానే తగ్గించుకున్నారా? వాచ్‌మెన్లు అని ఆ మంటను అలానే రగిలిస్తున్నారా? ఇదంతా జగన్ కావాలనే చేస్తున్నారా? ఆయన మాటల వెనుక వ్యూహం దాగుందా? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది.


గతం మరిచారా జగన్?

జగన్ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును ఎంతగా వేధించారో అందరికీ తెలిసిందే. ఆనాటి చంద్రబాబు పాలనలో ఐబీ చీఫ్‌గా ఉన్నారనే కక్ష్యతో.. అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆ ఐదేళ్లూ ఖాకీ యూనిఫాం వేసుకోనీయకుండా టార్చర్ చేశారు. జీతం కూడా రాకుండా కట్టడి చేశారు. కోర్టు తీర్పులనూ కేర్ చేయలేదు. ఏబీవీ మాత్రం తన పోరాటం ఆపలేదు. సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి.. గౌరవంగా రిటైర్ అయ్యారు. జగన్ తీరుపై ఆనాడే డిపార్ట్‌మెంట్లో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది.

Also Read : గోరంట్ల మాధవ్ అరెస్ట్? చేబ్రోలు కిరణ్‌పై అటాక్!

డిపార్ట్‌మెంట్‌ను డమ్మీ చేసిందెవరు?

అటు.. దుందుడుకు స్వభావం ఉన్న గోరంట్ల మాధవ్‌ను ఎంపీగా చేసి ఐదేళ్లూ ఆయనకు అండగా నిలిచారు. బూతు వీడియోలు వైరల్ అయినా పట్టించుకోలేదు. అటు, రఘురామ కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్‌లో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను బాగా వాడేసుకున్నారని అంటారు. ముంబై హీరోయిన్‌ను వేధించిన కేసులో ముగ్గురు పోలీస్ అధికారులను బలిపశువులను చేశారని చెబుతారు. ఐపీఎస్ సీతారామాంజనేయరెడ్డి అయితే అప్పుడూ ఇప్పుడూ పూర్తిగా జగన్ మనిషే అంటారు. డిపార్ట్‌మెంట్‌ను జగన్ వాడుకున్నట్టు మరెవరూ మిస్ యూజ్ చేయలేదని చెబుతుంటారు. అలాంటి జగనే.. ఇప్పుడు పోలీసుల బట్టలూడదీస్తా అని.. వారిని వాచ్‌మెన్లుగా చూస్తు్న్నారని అనడం విచిత్రంగా ఉందని టీడీపీ మండిపడుతోంది. P4 సుపరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే.. పోలీసుల్లో అభద్రతా భావం తీసుకొచ్చేందుకే.. జగన్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుమానిస్తు్న్నారు తెలుగు తమ్ముళ్లు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×