BigTV English

AP e crop 2025: ఏపీ రైతన్నలూ.. తప్పక ఇలా చేయండి.. లేకుంటే అన్నీ కట్!

AP e crop 2025: ఏపీ రైతన్నలూ.. తప్పక ఇలా చేయండి.. లేకుంటే అన్నీ కట్!

AP e crop 2025: ఈసారి పంట నాటలేదంటే, మద్దతు ధర కాదు.. ఇంకో ఏడాది నష్టపోవచ్చు. రైతన్నలెవ్వరూ దీనిని తక్కువ అంచనా వేయకండి.. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ వ్యవస్థ. పొలానికి వెళ్లేముందు మీరు ఈ పంట సర్వే గురించి తెలుసుకోకపోతే, మీ అక్కున చేరే భీమా, పెట్టుబడి మద్దతు అన్నీ హుష్ కాకి కావచ్చు. ఖరీఫ్ – 2025 కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే వ్యవస్థను ఇప్పుడే తెలుసుకోండి. ఓ రైతన్నగా మీ పేరు ప్రభుత్వ లెక్కల్లో ఉండాలంటే.. ఈసారి మరీ ముఖ్యంగా ఇదంతా తప్పక చేయాల్సిందే.


రైతన్నా.. ఇలా చేయండి
ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ – 2025 సీజన్ కోసం రైతులకు సంబంధించిన డేటాను ఖచ్చితంగా నమోదు చేయడానికి ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే ను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈసారి July మొదటి వారం నుంచే పంటల నమోదు ప్రారంభం అవుతుంది. NIC సాంకేతిక సహకారంతో ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సాగుతుంది. రైతుల భూముల సమాచారం, పంట వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్ వంటి వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయకపోతే, రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీలు, బీమా వంటి పథకాల బెనిఫిట్లు రావే అవకాశం లేదు.

సర్వే ఎందుకు?
ఈ సర్వేలో ప్రత్యేకంగా పరిగణించేది ఏమిటంటే.. సాగు కాని భూములు, ప్రభుత్వ భూములు, లీజ్ భూములు మొదలైన వివరాలను తొలగించి కేవలం రైతు సాగు చేస్తున్న భూముల వివరాలనే తీసుకుంటారు. ఇది పూర్తిగా జియో ట్యాగ్‌తో, ఫోటోల ఆధారంగా జరుగుతుంది. గతంలో ఒకసారి పంట నమోదు చేసిన వారు ఈసారి మళ్లీ అదే భూమికి సంబంధించిన తాజా ఫోటో తీసి జియో ఫెన్సింగ్ ద్వారా అప్‌డేట్ చేయాలి. బహువార్షిక పంటలైన అరటి, కొబ్బరి, మామిడి వంటి పంటల విషయంలో కూడా ఇదే విధానం అమలులోకి వస్తుంది.


ఈసారి మరొక విశేషం ఏమిటంటే.. పొలంలోని గట్లపై ఉన్న చెట్లు కూడా పంటలుగా పరిగణించి నమోదు చేయనున్నారు. అంతేకాకుండా, 0.25 ఎకరా కన్నా తక్కువ భూముల్లో పంట ఉందా లేదా అనే విషయం స్పష్టంగా ఫోటోతో రుజువు చేయాలి. పొలం గట్లపై పంటలు వేసినా, వాటిని మినహాయించకుండా నమోదు చేయాలి. ఇదంతా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో జరుగుతుంది. వ్యవసాయ పంటలను మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలను ఉద్యాన అధికారి పరిశీలించి ఆమోదిస్తారు. లీజు భూములు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో సాగు ఉంటే, తహసీల్దార్ లవే నిర్ణయం కీలకం అవుతుంది.

Also Read: AP Glass Bridge: విదేశాలకు ఎందుకు డబ్బులు దండగ.. ఇక వైజాగ్ కే వెళ్లండి.. ఎందుకంటే?

ఈ సర్వేలో నమోదు చేయాల్సిన ముఖ్యమైన విషయాల్లో పంటల రకం, విస్తీర్ణం, సాగులో ఉన్న భూములు, సాగులో లేని భూములు, బీడు భూములు, ఆక్వా సాగు వివరాలు ఉన్నతమైన కేటగిరీలుగా వర్గీకరించి నమోదు చేయాలి. రైతు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ తప్పకుండా అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తిగా తప్పనిసరి కాకపోయినా, డేటా ఖచ్చితంగా ఉండాలి.

సచివాలయాల పునర్విభజన ప్రకారం, రైతు సేవా కేంద్ర సిబ్బందిని రెవెన్యూ గ్రామాల మేరకు మ్యాపింగ్ చేసి పంపిణీ చేయనున్నారు. రైతులు ఏ సమస్య వచ్చినా స్థానిక వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

ఈ సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితమైన వ్యవసాయ సమాచారాన్ని సేకరించడం, రైతు సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ముఖ్య ఉద్దేశం. సర్వేను అప్రామాణికంగా నిర్వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రతి రైతు తమ భూమికి సంబంధించిన సమాచారం జియో ట్యాగ్ చేసి, తప్పనిసరిగా 100 శాతం నమోదు చేయించుకోవాలని సూచించారు.

ఈ సారి పంట నాటకపోతే కాదు.. పంట వివరాలు నమోదు చేయకపోతే కేంద్రం, రాష్ట్రం ఇచ్చే మద్దతులన్నీ నష్టమవుతాయి. మీ భూమి మీ చేతుల్లో ఉండాలంటే.. డిజిటల్ సర్వేలో మీరు లేకపోతే, మీ ప్రయోజనం ఎవరికీ తెలియదు. ఏపీ రైతన్నలూ.. మీరు ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొనండి. మీరు వ్యవసాయానికి విలువనిస్తే.. ప్రభుత్వం కూడా మీ వెంటే నిలుస్తుందని కూటమి అంటోంది.

Related News

Nellore Ysrcp: కాకాణి రాకతో మారిన నెల్లూరు రాజకీయం.. జిల్లాపై పెత్తనం ఎవరిదంటే?

Nidigunta Aruna: ఇంతకీ అరుణ ఏ పార్టీ? తేలు కుట్టిన దొంగల్లా నేతలు

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

India pension plan: 60 ఏళ్ల తర్వాత కూడా టెన్షన్ ఫ్రీ.. ఈ సూపర్ స్కీమ్ మీకు తెలుసా!

Big Stories

×