Tirupati Tragedy: మద్యం మత్తులో కారులో నిద్రపోయి మరణించారు ఇద్దరు యువకులు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగింది. తిరుచానూరుకు చెందిన దిలీప్, వినయ్ కారులో AC ఆన్ చేసి అందులో కూర్చొని మద్యం సేవించారు. మందు ఎక్కువ కావడంతో కారులోనే నిద్రించారు. కొంత సేపటికి కారులో పెట్రోల్ అయిపోవడంతో AC ఆగిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు యువకులు మృతిచెందారు.సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. దిలీప్, వినయ్ మృతదేహాలను ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా తిరుచానూరులో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారులో నిద్రపోయిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన శనివారం జరిగింది. మృతులు తిరుచానూరు ప్రాంతానికి చెందిన దిలీప్, వినయ్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు బయటకు వెళ్లి మద్యం సేవించారు. అనంతరం తిరుచానూరులో పార్క్ చేసిన కారు లోపలే.. ఏసీ ఆన్ చేసి కూర్చొని మద్యం తాగారు. మద్యం మోతాదు ఎక్కువగా తీసుకోవడంతో కారులోనే నిద్రించారు. అయితే కొద్దిసేపటికే కారులో పెట్రోల్ అయిపోవడంతో AC పనిచేయడం ఆగిపోయింది.
ఇలా కారులో నిద్రిస్తున్న క్రమంలో.. పెట్రోల్ మొత్తం ఖాళీ కావడంతో.. ఇంజన్ ఆగిపోయి ఉంటుందని.. అదికాక కారు కిటికీలు అన్నీ మూసివేసి ఉండడంతో.. ఊపిరాడక యువకులు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
స్థానికులు కారులో యువకులు నిర్జీవంగా ఉన్నట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుచానూరు పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి విచారణ చేపట్టారు. మృతుల మద్యం సేవించే స్థలం, ఎలాంటి మత్తు పదార్థాలు ఉపయోగించారా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. కారు లోపల గ్యాస్ లీకేజీ జరిగిందా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది కూడా పరిశీలిస్తున్నారు.
Also Read: భార్య చేతుల్లో భర్త బలి.. వివాహం జరిగిన రెండు గంటల్లో
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. యువకుల మృతి పట్ల వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సరదాగా మద్యం తాగి కారులో నిద్రించడం.. చివరికి ప్రాణాలను తీసే పరిస్థితికి దారితీయడం స్థానికులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.