E-Paper
Advertisement

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ
Advertisement

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఇక పార్టీల వంతు మొదలైంది. కూటమిలో సీట్ల కేటాయింపుపై గడిచిన మూడు రోజులుగా ఎడతెగని చర్చలు జరిగాయి. చివరకు బుధవారం రాత్రి సీట్ల అంశం ఓ కొలిక్కి వచ్చింది. కాకపోతే ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొన్ని చోట్ల టీడీపీ నేతల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు

ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు జరిగింది. గడిచిన మూడు రోజులుగా టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య ఎడతెగని చర్చలు ఫలించాయి. గంటల తరబడి నేతలు కసరత్తు చేశారు. అన్నింటికంటే ముందుగా కార్పొరేషన్లకు ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది. తొలుత ఆరు కార్పొరేషన్లు డిమాండ్ చేసినా, బలమైన నేతలకు లేకపోవడంతో ఆ పార్టీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

జనసేన-4, బీజేపీ ఒక కార్పొరేషన్లలో పోటీ

Advertisement

చివరకు జనసేన -4 కార్పొరేషన్లలో పోటీ చేయనుంది. అందులో విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు సీట్ల నుంచి బరిలోకి దిగనుంది. చివర నిమిషంలో ఏమైనా మార్పులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ మాత్రం రాజమండ్రి కార్పొరేషన్ సీటు కోరుతోంది. మిగతా కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేయనుంది. అయితే విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు వంటి మేయర్ సీట్లు జనసేనకు కేటాయించడంతో టీడీపీ అప్పుడే అసంతృప్తి మొదలైంది.

మిగతా చోట్ల టీడీపీ పోటీ, కొన్ని చోట్ల నేతల అసంతృప్తులు

ఇక మున్సిపాలిటీల విషయానికి వద్దాం. జనసేన 15 నుంచి 20 సీట్లలో పోటీకి రెడీ అవుతోంది. దీంతో 2 లేదా 3 నగర పంచాయతీల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. జనసేన కోరుతున్న మున్సిపాలిటీల్లో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, .తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి ఆదోని మున్సిపాలిటీలు కోరుతోంది.

Advertisement

ALSO READ: ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు కోరుతోంది. అయితే చివరి నిమిషంలో అక్కడ ఏమైనా సర్దుబాటు జరిగితే అటు ఇటుగా మార్పులు జరిగే అవకాశముంది. టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన సీట్లను డిమాండ్ చేసినట్టు కనిపిస్తోంది. నగర పంచాయితీలు వచ్చేసరికి పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర డిమాండ్ చేస్తోంది. ఇక బీజేపీ విషయానికి వద్దాం. యలమంచిలి, బాపట్ల, శ్రీకాళహస్తి, ఎర్రగుంట్ల, గూడురు కోరుతోంది. చివరి నిమిషంలో అక్కడ మార్పులు జరిగే అవకాశముందని నేతలు చెబుతున్నారు.

Related News

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

Big Stories

Advertisement
×