Child Safety; నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని ఒక కంట కనిపెట్టుకోవాల్సిందే. అయితే ఈసారి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా.. సీపీ రాజశేఖర్ బాబు ఆలోచనతో పోలీసులు ఒక సూపర్ ఐడియా అమలు చేశారు. అదే ‘చైల్డ్ సేఫ్టీ క్యూఆర్ కోడ్ ట్యాగ్’ అమ్మవారీ దర్శనానికి వచ్చే ప్రతి చిన్నారికి ఈ ట్యాగ్‌ను చేతికి తొడుగుతున్నారు. ఇందులో బాబు వివరాలన్నీ ఉంటాయి.
తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన ఆరు సంవత్సరాల బాలుడు.. రద్దీలో అకస్మాత్తుగా క్యూలైన్లో తప్పిపోయాడు. చుట్టూ జనం ఎక్కువైపోవడంతో ఆ చిన్నారి ఒంటరిగా భయపడిపోయాడు. అయితే, చిన్నారి చేతికి ఉన్న ఆ క్యూఆర్ కోడ్ ట్యాగ్ పోలీసులకు లైఫ్ సేవర్ లాగా మారింది.
డీసీపీ రామకృష్ణ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ ఆ ట్యాగ్‌ను స్కాన్ చేసి, క్షణాల్లో వివరాలు రాబట్టారు. వెంటనే అప్రమత్తమై బాలుడి ఆచూకీ కనిపెట్టి సేఫ్‌గా తల్లి వద్దకు చేర్చారు. తమ బిడ్డ క్షేమంగా దొరకడంతో ఆ తల్లి ఊపిరి పీల్చుకుంది. పోలీసులకు చేతులెత్తి దణ్ణం పెట్టి కృతజ్ఞతలు చెప్పింది.
Also read: వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్ఆర్సీపీ కీలక నేతలు జంప్?