E-Paper
Advertisement

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా
Advertisement

Amaravati: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగింది. కార్పొరేషన్లు మొదలు పంచాయితీ ఎన్నికలు డిసెంబర్ రెండు నాటికి పూర్తి కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు.

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు

కొత్త పార్టీ పెట్టనున్న విజయసాయిరెడ్డి మనస్సు అంతా ఏపీపై ఉంది. చికిత్స కోసం దూరంగా కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఏదో ఒక విషయం గురించి ఎక్స్ వేదికగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నోరు విప్పారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఆ ఎన్నికల గురించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.

అధికార పార్టీకి అనుకూలం, పవన్‌పై ప్రశంసలు

Advertisement

ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ఆయన జోస్యం చెప్పారు. నార్మల్‌గా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు.. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. సాయిరెడ్డి కూడా అదే చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు 2029 ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ప్రజాదరణకు కొలమానం కాదన్నది ఆయన మాట. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా దాని ఆధారంగా ఫలితాలను తీసుకుని 2029 ఎన్నికలను అంచనా వేయలేమన్నారు.

అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు విజయసాయిరెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు మార్గాల అనుసంధానం మెరుగుపరచాలన్న ఆయన నిర్ణయం గొప్పదిగా చెప్పారు. రాష్ట్రంలో 30 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయని, కోట్ల మంది భక్తులు పవిత్ర క్షేత్రాలను వెళ్లేలా మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. ఉన్నట్లుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సాయిరెడ్డి మోత వెనుక ఏం జరుగుతోంది?

Advertisement

ALSO READ: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ

రేపో మాపో కొత్త పార్టీకి రెడీ అవుతున్న సాయిరెడ్డి, జనసేనతో కలిసి 2029 ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నారా? వైసీపీని నేరుగా ఎటాక్ చేయకుండా పవన్ ద్వారా ఇండైరెక్ట్‌గా టార్గెట్ చేస్తున్నారా? అంటూ కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. వైసీపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సీనియర్ పొలిటీషియన్.

 

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Big Stories

Advertisement
×