Brahmamudi serial today Episode: లక్కీకి కూడా శోభనం అయిపోతుంది. నాకే ఇంకా ఏమీ కావడం లేదని రాజు ఫీల్ అవుతుంటే.. అప్పుడే ఇందు పాలు తీసుకుని రూంలోకి వస్తుంది. ఫస్ట్ నైట్ అక్కడ జరుగుతుంటే పాలు ఇక్కడికి వచ్చాయేంటి అని రాజు రొమాంటిక్ గా చూస్తూ అడిగితే.. హలో రాజు గారు ఉదయం నుంచి బాగా కష్టపడ్డారని పాలు తీసుకొచ్చాను ఇవి తాగేసి పడుకోండి అంటూ ఇందు వార్నింగ్ ఇస్తుంది.
రాజు పాలు తాగి ప్రేమతో తీసుకొచ్చానని చెప్పొచ్చు కదా ఇప్పుడు చెప్తాను ఉండు అని మనసులో అనుకుంటూ బయటకు ఇందు మా నాన్న చెప్పింది ఏం ఆలోచించావు అని అడుగుతాడు. మీ నాన్న చెప్పింది ఏంటి..? అని ఇందు అడిగితే.. అదే పిల్లల గురించి.. అదే ఎప్పుడు చెప్తారు శుభవార్త అని అడుగుతున్నారు కదా అంటే పిల్లలు కావాలా… రేపు ఉదయమే ఇద్దాం అద్దె మొగుడికి అద్దె పిల్లలే కదా ఉంటారు అంటూ వెళ్లిపోతుంది ఇందు.
మదన్ కోపంగా డెలివరీ బాయ్‌కు ఫోన్ తిడుతుంటాడు. ఎంతసేపైంది ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసి అంటూ తిడుతుంటాడు. అప్పుడే బయటి నుంచి స్వాతి వచ్చి డోర్ కొడుతుంది. మదన్ కోపంగా వెళ్లి డోర్ తీసి ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ తిడుతూ సారీ నువ్వా..? అంటాడు స్వాతి షాక్ అవుతుంది. లేటయిందా బావ అంటుంది. ఏం లేదు ఫుడ్ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు అంటూ స్వాతి చేతిలో ఉన్న బాక్స్ చూసి ఏంటది అని అడుగుతాడు. నీకు ఎంతో ప్రేమతో మా ఆంటీ ఫుడ్ పంపించింది. అని చెప్పగానే.. ఏ ఆంటీ అని మదన్ అడిగితే.. నాకు ఎంత మంది ఆంటీలు ఉన్నారు.. నా ప్రియమైన శ్రీవారి అమ్మగారు అని చెప్పగానే.. మదన్ కోపంగా స్వాతిని తిట్టి చేతిలో బాక్స్ విసిరిపడేస్తాడు. అప్పుడే ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్లిపోతాడు. అది తీసుకుని మదన్ తింటుంటాడు.
అపర్ణ కోపంగా సుభాష్‌తో ఐశ్వర్యను తిడుతుంది. పెళ్లిలో ఐశ్వర్య చేసిన బిహేవ్ గురించి అపర్ణ గుర్తు చేసి అలాంటి దానికి బిజినెస్ అప్పగిస్తే ఎలా చేస్తుందో కంపెనీ ఏమవుతుందో అని బాధపడుతుంది. సుభాష్ మాత్రం ఐశ్వర్యకు వెనకాలే ఇందు, రాజు ఉన్నంత వరకు మన కంపెనీకి ఏమీ కాదని చెప్తాడు సుభాష్. ఇక హాల్లో కూర్చున్న శేషు, రాజు ఇద్దరూ కలిసి లక్కీ గురించి మాట్లాడుకుని నవ్వుకుంటారు. ఆల్ రెడీ ఐషు కడుపుతో ఉంది కాబట్టి లక్కీ గాని బతుకు బస్టాండే అనుకుంటారు. అప్పుడే లక్కీ వస్తూ.. ఎవరికి దొరికినా వీళ్లకు మాత్రం దొరక్కూడదు అనుకుంటూ దగ్గరకు వెళ్లి శోభనం జరిగినట్టు బిల్డప్ ఇస్తుంటాడు.
రాజు, శేషు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. తర్వాత భ్రమరాంబ, రేఖ, భూషణ్ వచ్చి ఐశ్వర్య గురించి మాట్లాడతారు. ఐశ్వర్య ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మాట్లాడతారు. అప్పుడే ఐశ్వర్య రెడీ అయి కిందకు వస్తుంది. ఎక్కడికి రెడీ అయ్యావు అని ఇందు అడిగితే ఆఫీసుకు రెడీ అయ్యాను అంటుంది. వారం తర్వాత వెళ్లొచ్చు కదా అంటే.. ఎందుకు అంతవరకు ఇచ్చిన కంపెనీని లాగేసుకుందామనా.. అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ఐశ్వర్య. రేఖను కూడా లెక్కచేయకుండా ఐశ్వర్య వెళ్లిపోతుంది. దీంతో శేషు వెటకారంగా కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేసింది అంటాడు. రాజు కూడా మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో పాపం రేఖ ఆంటీ పరిస్తితి ఏంటో అంటాడు.
వెంకీని ఆఫీసులో వాళ్ల బాస్ పిలిచి తిడతాడు. నీ పని నువ్వు చేసుకో వేరే పనిలో వేలు పెట్టాలని చూస్తే బాగుందడు అంటూ వార్నింగ్ ఇస్తాడు. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు లేకపోతే ఈ ఉద్యోగం చేయకు అంటూ కోప్పడతాడు. మరోవైపు ఐశ్వర్య తన ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ ఉన్న శృతిని పిలిచి తన ఆఫీసులో సీనియర్ స్టాప్ అంటే స్వరాజ్ కంపెనీ నుంచి ఇక్కడకు వచ్చిన వాళ్లు ఎంత మంది ఉన్నారు అని అడిగితే.. తనతో కలిపి ఐదు మంది ఉన్నారు అని శృతి చెప్పగానే.. ఆ ఐదు మందిని జాబ్‌లోంచి తీసేస్తుంది ఐశ్వర్య. శృతి దుగ్గిరాల ఇంటికి వెళ్లి ఐశ్వర్య తమను జాబ్‌లోంచి తీసేసిన విషయం చెప్తుంది. అందుకు రాజు, ఇందు షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.