Jana Sena: ఏపీలో రాజకీయ చదరంగం గంట గంటకి కొత్త ట్విస్టులు ఇస్తుంది. జగన్కి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ పార్టీలో కొందరు కీలక నేతలు జనసేన పార్టీలోకి జంప్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. జనసేనలోకి కొంత మంది వైసీపీ నేతలు చేరారు.
వీరిలో డోలా జగన్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో పార్టీలో చేరారు. శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ డోలా జగన్ జనసేనలోకి రావడం వైసీపీ పార్టీకి గట్టి షాక్ గానే చెప్పుకోవచ్చు. ఇతనితో పాటుగా తిరుపతికి చెందిన పెనుమాదు ప్రణీత్ జనసేన పార్టీలో చేరారు. మరియు ఆచంటకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేత తుంగ నాగేశ్వరరావు సైతం జనసేన పార్టీలో చేరారు.
ఏడీఎస్ ప్రసాద్, మారుతి, దోవరీ అమర్నాథ్కు కీలక నేతలు సైతం జనసేన కండువాలు కప్పుకున్నారు. జనసేనా పార్టీ కార్యాలయంలో కొత్తగా చేరిన వారికి కండువాలు కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారితో జనసేన ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ దిశానిర్థేశం చేశారు. ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా పనిచేయాలని నేతలకు పవన్ తెలిపారు.
Also read: జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్కు షాక్!