E-Paper
Advertisement

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!
Advertisement

Krishna Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయ్. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా.. పురపాలక శాఖ మున్సిపల్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని మొత్తం 7 మున్సిపాలిటీల్లో.. 5 చైర్‌పర్సన్ పదవులు మహిళలకే కేటాయించారు. అంటే జిల్లాలో దాదాపు అగ్రభాగం స్థానాలు మహిళా నాయకత్వానికే దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. ఈ క్రమంలో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రిజర్వేషన్ కోటా పూర్తిస్థాయిలో అమలవుతూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.

హీటెక్కిన రాజకీయం..

మొత్తం 7 స్థానాల్లో 5 స్థానాలు మహిళలకు కేటాయించగా, మిగిలిన 2 మున్సిపాలిటీల్లోని చైర్‌పర్సన్ పదవులు ఇతర వర్గాలకు కేటాయించడం జరిగింది. తాజా రిజర్వేషన్ల ఖరారుతో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు.. రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయ్. టికెట్ల కోసం ఆశావహులైన మహిళా నేతల లాబీయింగ్ కూడా తెరవెనుక జోరందుకుంది. మహిళలకు పెద్దపీట వేస్తూ వెలువడిన ఈ రిజర్వేషన్ల జాబితాతో.. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మహిళల పట్టు మరింత బలపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమరం రంజుగా మారనున్న తరుణంలో.. ఈ రిజర్వేషన్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయి? మున్సిపల్ పీఠాలపై ఏ మహిళా నేతలు కూర్చుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Also read: కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

Tags

Related News

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

Big Stories

Advertisement
×