BigTV English

AP: బిల్లులన్నీ చెల్లిస్తాం.. ఉద్యోగుల దెబ్బకు దిగొచ్చిన సర్కార్.. సీపీఎస్‌పై తగ్గేదేలే..

AP: బిల్లులన్నీ చెల్లిస్తాం.. ఉద్యోగుల దెబ్బకు దిగొచ్చిన సర్కార్.. సీపీఎస్‌పై తగ్గేదేలే..

AP: ఏపీ సర్కారు చాలా తెలివిగా వ్యవహరించింది. పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, సీపీఎస్ రద్దుపై చర్చించకుండా.. ఉద్యోగుల మిగతా సమస్యలకు మాత్రం శుభం కార్డు వేసింది. మార్చి నెలాఖరు నాటికి.. 3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయినా, ఉద్యమ కార్యచరణపై వెనక్కి తగ్గలేదు ఉద్యోగ సంఘాలు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తే.. అప్పుడు చూస్తాం అన్నట్టు చెప్పారు.


సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ తదితర సంఘాలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించారు. ఈసారి కూడా కేఆర్‌ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని చర్చలకు పిలవకుండా పక్కనపెట్టేసింది ప్రభుత్వం.

ఉద్యోగుల పీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులన్నీ ఈ నెలలోనే క్లియర్‌ చేస్తామని సర్కార్ తరఫున మంత్రులు హామీ ఇచ్చారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని, అందుకే ఉద్యోగులకు చెల్లింపులు చేయలేకపోయామని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. ఉద్యోగుల సమస్యలపై రెండు మెట్లు దిగే చర్చలు జరుపుతున్నామని చెప్పారు.


అయితే, సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని.. తమ ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చిస్తామన్నారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×