Crime Drama Series on OTT: కార్పొరేట్ క్రైమ్ అండ్ అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే వెబ్ సిరీస్‌లకు గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఒక యంగ్ కాలేజ్ స్టూడెంట్ లైఫ్ కి, డార్క్ క్రైమ్ వరల్డ్ కి మధ్య నడిపే మైండ్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘Power Book II: Ghost హాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ‘పవర్’ ఫ్రాంచైజీ నుండి వచ్చిన స్పిన్-ఆఫ్ సూపర్ హిట్ సిరీస్ గా దీనిని రూపొందించారు. ప్రఖ్యాత రాపర్ 50 సెంట్ నిర్మించిన ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం నాలుగు సీజన్లు, 40 ఎపిసోడ్‌లతో ఈ క్రైమ్ డ్రామా సాగుతుంది.
న్యూయార్క్‌లోని స్టాన్స్‌ఫీల్డ్ యూనివర్సిటీలో చదువుకునే తారిక్ సెయింట్ పాట్రిక్ (మైఖేల్ రైనీ జూనియర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతడి తండ్రి జేమ్స్ సెయింట్ పాట్రిక్ అలియాస్ ఘోస్ట్ ఒకప్పుడు అండర్‌వరల్డ్‌లో పేరుమోసిన డ్రగ్ డీలర్. అయితే తండ్రి మరణం తర్వాత తారిక్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ తల్లి టాషా జైలులో ఉండటంతో ఆమెను బయటకు తీసుకురావడానికి డబ్బు అవసరమవుతుంది. దీంతో చదువును కొనసాగిస్తూనే డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది.
ఇక్కడే తారిక్ జీవితంలో అసలైన సమస్య మొదలవుతుంది. కాలేజ్‌లో ఒక సాధారణ విద్యార్థిలా కనిపిస్తూ, మరోవైపు రహస్యంగా డ్రగ్స్ దందాను నిర్వహించాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన స్నేహితుడు బ్రేడెన్ వెస్టన్‌తో కలిసి వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు మోనెట్ టెజాడా (మేరీ జె. బ్లైజ్) కుటుంబంతో అతడికి ఏర్పడే సంబంధాలు పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తాయి. నమ్మకాలు, ద్రోహాలు, హత్యలు, పోలీసుల నిఘా మధ్య తారిక్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది.
తండ్రి నేర ప్రపంచం నుంచి బయటపడాలనుకున్న తారిక్.. చివరకు అదే ప్రపంచంలో మరింత లోతుగా కూరుకుపోతాడా? తన తల్లిని కాపాడుకుంటూ కాలేజ్ చదువును పూర్తి చేయగలడా? అనేదే ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. ఇందులో కాలేజ్ లైఫ్, క్రైమ్ బిజినెస్ మధ్య తారిక్ ఎదుర్కొనే సంఘర్షణ, ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఈ సిరీస్‌లో మైఖేల్ రైనీ జూనియర్, మేరీ జె. బ్లైజ్, మెథడ్ మ్యాన్, జియాని పాలో, వుడీ మెక్‌క్లెయిన్, లాటోయా టోనొడియో, షేన్ జాన్సన్ తదితరులు నటించారు. 2020 సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సిరీస్ నాలుగు సీజన్లతో 2024లో ముగిసింది. ప్రఖ్యాత రాపర్ 50 సెంట్ నిర్మించిన ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ జెయింట్ Netflix లో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. హై-క్వాలిటీ విజువల్స్ తో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఆప్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
Read Also: గెస్ట్‌హౌస్‌లో రాత్రి… లవర్స్ లైఫ్‌ను రోడ్‌మీదికి లాగిన ఆగంతకుల గ్యాంగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్