BigTV English

AP New Ration Card: AP రేషన్ కార్డులో WIFE ఆప్షన్ ఎక్కడ? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి

AP New Ration Card: AP రేషన్ కార్డులో WIFE ఆప్షన్ ఎక్కడ? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి

AP New Ration Card: ఏపీలో నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్డుల మంజూరులో ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలతో ఇక అనర్హులకు మాత్రం రేషన్ కార్డు ఇక దూరమేనని చెప్పవచ్చు. అయితే ఈ కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం అందరినీ, ఆశ్చర్యకితులను చేస్తోంది. ఇంతకు ఆ నిర్ణయం ఏమిటి? దీనితో కలిగే మేలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.


రేషన్ కార్డు మంజూరులో విప్లవం..
ఇది చిన్న మార్పు కాదు.. పెద్ద ప్రకటన. కుటుంబాల రేషన్ కార్డుల విషయంలో ఒక కీలకమైన విధాన మార్పును ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నూతన రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియలో ఇకపై WIFE అనే ఆప్షన్ ఉండదు. దీని స్థానంలో HOF (Head of the Family) అనే పద్ధతిని అనుసరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం జాతీయ ఆహార భద్రత చట్టం.

ఎందుకిలా?
ఇక నుంచి ఇంట్లో వయసు ఎక్కువ కలిగిన మహిళను కుటుంబ పెద్దగా గుర్తించాల్సి ఉంటుంది. అదే ఆమె పేరు రేషన్ కార్డులో Head of the Family (HOF)గా నమోదు అవుతుంది. పాత రేషన్ కార్డుల్లో భర్త పేరు ముందుండి, భార్య పేరు WIFE అనే ట్యాగ్‌తో ఉండేది. కానీ ఇప్పుడు ఎవరైతే ఇంటి వయోజ్ఞురాలుగా ఉంటారో, వారికి పూర్తి గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం.


కారణాలు..
ఈ విధానం అమలులోకి రావడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది, జాతీయ ఫుడ్ సెక్యూరిటీ చట్టం స్పష్టంగా చెప్పిన మాటే. ఇంట్లో వయసు గల మహిళను కుటుంబానికి అధిపతిగా గుర్తించాలి. రెండవది, మహిళలకు కుటుంబంలో గుర్తింపు, అధికారం కల్పించడం.. ఇది మహిళా సాధికారత దిశగా పెద్ద అడుగు. ఈ మార్పు ద్వారా భార్య, వృద్ధ మహిళలు ఇక కుటుంబానికి పేరుకే పెద్ద కాదు, పదవికి పెద్ద అవుతారు.

గౌరవం తప్పనిసరి..
HOF అంటే Head of the Family. ఇది లింగ భేదం లేకుండా, కుటుంబంలో వయసులో పెద్ద వ్యక్తిని సూచించే పదం. అయితే నిబంధనల ప్రకారం, ఇది ప్రధానంగా మహిళలకే వర్తించనుంది. ఎందుకంటే NFSA ప్రకారం కుటుంబంలోని వయోజ్ఞురాలే మొదటి గుర్తింపు పొందాలి. అందుకే రేషన్ కార్డుల్లో WIFE అనే పదాన్ని తొలగించి HOF అనే పదంతో వారికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మార్పు వల్ల మహిళలకు పారదర్శక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరిపాలనలో మహిళా పాత్రకు గౌరవం లభిస్తుంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధుల పంపిణీలో నేరుగా మహిళల పేరిట లబ్ధి లభిస్తుంది. పౌర రికార్డుల్లో లింగ సమానతకు బలమైన సూచిక ఇది.

Also Read: Jet Speed Train in India: జెట్ స్పీడ్ ట్రైన్ వస్తోంది.. ఇక ఆగేదే లేదు!

ఇందుకు.. ఈ రూల్స్ కారణం
నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఇలా చేసేందుకు కొన్ని స్పష్టమైన రూల్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో వృద్ధ మహిళ ఉన్నపుడు, ఆమె పేరు HOFగా ఉండాలి. ఆమె లేనిపక్షంలో వృద్ధ పురుషుడు HOFగా నమోదు అవుతాడు. WIFE అనే పదాన్ని ఇకపై ఏ ఫారంలోనూ వాడకూడదు. ఇతర కుటుంబ సభ్యులు అయితే Relation to HOF కింద Mother, Son, Daughter లాంటి సంబంధ సూచికలతో నమోదు అవుతారు.

ఈ అనుమానం వద్దు
కొత్తగా పెళ్లయిన కుటుంబాల్లో ఇలాంటి మార్పులు చూసి కొంతమంది ఇంకా భర్త పేరు ముందు ఎందుకు రావట్లేదు? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది చిన్న ఆవేదన కాదని, దీని వెనుక ఉన్న ఉద్దేశం గౌరవదాయకమైనదే అని ప్రభుత్వం చెబుతోంది. ఇకపై మహిళలకే ప్రాధాన్యం, ఆమెకే ముందు గుర్తింపు అనేది సామాజిక మార్పుకు సంకేతం. ఈ మార్పు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంజూరవుతున్న రేషన్ కార్డులపై అమలవుతోంది. పాత రేషన్ కార్డులను కూడా దశలవారీగా NFSA ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలూ దీన్ని త్వరలో అనుసరించే అవకాశముంది. ఈ మార్పుతో డిజిటల్ రేషన్ కార్డుల్లో మహిళల వివరాలు ఆధారంగా ప్రధానంగా చూపబడతాయి. ఆధార్, రేషన్, ఇతర ప్రభుత్వ సేవల లింకేజీ పూర్తిగా HOF ఆధారంగానే జరగనుంది.

ఆ పదం హుష్ కాకి..
ఇకపై రేషన్ కార్డుల్లో WIFE అనే పదం కనిపించకపోవచ్చు. కానీ అందుకు పక్కా కారణం ఉంది. మహిళలకు మన కుటుంబ వ్యవస్థలో గౌరవం, అధికార గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశమే దీని వెనుక ఉంది. ఇది చిన్న మార్పు కాదు.. ఒక సామాజిక మార్పు. ప్రతి కుటుంబంలో మహిళల ఆధిపత్యానికి రేషన్ కార్డు ఓ ప్రమాణంగా మారుతోంది. ఇకపై ఇంట్లో వీరు ఎవరు? అంటే, ఆమెనే హెడ్ అండీ అనే సమాధానం రావాల్సిందే.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×