Jet Speed Train in India: వస్తోంది.. ఇక జెట్ స్పీడ్ ట్రైన్. ఇండియన్ రైల్వే చరిత్రలో మరో నూతన ఆధ్యాయం మొదలు కానుంది. దీనితో రైల్వే చరిత్రలో ఇక ఆగేది లేదు అనే మాట వినిపించబోతోంది. జస్ట్ ఒక్కసారి స్టార్ట్ అయితే చాలు, ఈ ట్రైన్ ఇక గమ్యానికే. ఇప్పటి వరకు ఓ లెక్క.. క్షణాల్లో గమ్యం చేరడం మరో లెక్క అనే తరహాలో ఇండియన్ రైల్వే దూసుకువెళుతోంది. మొత్తం మీద ఇంతలా ఇండియన్ రైల్వే సాధించిన ఈ ఘనత తెలుసుకొని, మనం కూడా ముచ్చట పడాల్సిందే. మరి ఆ ముచ్చట ఏమిటో తెలుసుకోవాలని ఉంటే, ఈ కథనం పూర్తిగా చదవండి.
ఇండియన్ రైల్వే మరో మెట్టు ఎక్కింది. ఇప్పటి వరకు మనం చూసిన ఇంజిన్లన్నీ సాధారణ వేగానికి పరిమితమై ఉండగా, ఇప్పుడు వందల టన్నుల బరువును, కిలోమీటర్ల పొడవున గల గూడ్స్ రైళ్లను కూడా ఉరికించేస్తూ ముందుకెళ్లే శక్తిని పొందిన కొత్త లోకోమోటివ్ జన్మించింది. అదే 9000 హార్స్ పవర్ (HP) విద్యుత్ ఇంజిన్ WAG-9i. ఇది జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ భారత రైల్వే శక్తి సామర్థ్యాన్ని కొత్త పుంతలకి నడిపిస్తోంది.
ఎక్కడ తయారవుతోంది ఈ రైలు?
ఈ అధునాతన లోకోమోటివ్‌లను బీహార్‌లోని మధెపురా లోకోమోటివ్ ఫ్యాక్టరీ (Electric Locomotive Factory Madhepura) లో తయారు చేస్తున్నారు. ఇది భారత రైల్వే, ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టమ్ (Alstom) అనే ప్రఖ్యాత కంపెనీ కలిసికట్టుగా స్థాపించిన సంయుక్త ఒప్పంద ఫ్యాక్టరీ. మేక్ ఇన్ ఇండియా పేరిట జరిగిన ఈ వినూత్న అభివృద్ధి ద్వారా భారత్‌లోనే అత్యాధునిక విద్యుత్ లోకోమోటివ్‌లు తయారవుతున్నాయి.
9000 HP అంటే ఏంటి?
ఒక సాధారణ WAG-9 లోకోమోటివ్‌కు 6000 HP శక్తి ఉంటుంది. కానీ ఈ కొత్త WAG-9i లోకోమోటివ్ 9000 హార్స్ పవర్ సామర్థ్యంతో, మూడు రైల్వే ఇంజిన్ల పని ఒక్కటే చేస్తుంది. దీని వల్ల భారీగా లోడ్ చేసిన గూడ్స్ రైళ్లను తక్కువ ఇంజిన్లతోనె లాక్కెళ్లవచ్చు. మరింత వేగంగా, సమయపాలనతో రవాణా చేయవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగించవచ్చు.
ఈ అత్యాధునిక లోకోమోటివ్ 90 నుంచి 120 వ్యాగన్‌లు కంటైనర్లు, బొగ్గు, సిమెంట్, ఉక్కు రేకు వంటి వాణిజ్య సరుకులను సరాసరి 100 కి.మీలను గంట వేగంతో లాక్కెళ్లగలదు. కొన్ని సందర్భాల్లో ఇది 130 వ్యాగన్‌ల దాకా లాక్కెళ్లిన రికార్డులు కూడా ఉన్నాయి. అది ట్రాక్ పరిస్థితులు, లోడ్ బరువు, గాలిపోటు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
భారీ గూడ్స్ ట్రెయిన్
సాధారణంగా 6000 HP ఇంజిన్‌కు 60 నుండి 70 కోచ్‌లలోపు సామర్థ్యం ఉంటుంది. కానీ WAG-9i 9000 HP మల్టిపుల్ యూనిట్‌తో పనిచేస్తుంది. దీని బలం వల్ల పెద్దగా మలుపులు ఉన్న రూట్లలోనూ ఇది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. సింగిల్ ఇంజిన్‌తోనే చాలా రవాణా ఖర్చు ఆదా అవుతుంది.
ప్రత్యేకతలు ఇవే..
ఇది గరిష్ఠంగా 6000 టన్నుల వరకు సరుకులు లాక్కెళ్లగలదు. సాధారణ గూడ్స్ రైలు అంటే 58 నుండి 70 వ్యాగన్లు ఉంటే, ఈ లోకోమోటివ్ 100కు పైనే వ్యాగన్లు మోయగలదు. ఇది ప్రత్యేకంగా మెటల్, మైనింగ్, కోల్, పారిశ్రామిక రవాణా కోసం రూపొందించబడింది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ ఇంజిన్‌కి మైక్రోప్రాసెసర్ ఆధారిత నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. అలాగే, ఇంటెలిజెంట్ డేటా మానిటరింగ్ సిస్టమ్, బోగీ ఫలితాల విశ్లేషణ, పవర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ వంటివి దీని ప్రత్యేకతలు. ఈ లోకోమోటివ్ 120 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. అంతేకాదు, ఒకే ఇంజిన్ మూడు కంటైనర్ రైళ్లను లాక్కెళ్లగలదు. ఇది సాధారణ రైల్వే టెక్నాలజీలో ఓ విప్లవం.
ఇండియన్ రైల్వే మారు రూపం
ఇప్పుడు భారత రైల్వే గూడ్స్ సేవల్లో తక్షణ డెలివరీ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా పని చేస్తోంది. టోటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కార్యక్రమంలో భాగంగా, రైల్వే శాఖ ఈ కొత్త లోకోమోటివ్‌లను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతోంది. ఇవి దేశవ్యాప్తంగా నడుస్తూ:
మైనింగ్ ఏరియాల్లో ఉక్కు, సిమెంట్, బొగ్గు, రైస్ మిల్లుల రవాణాలో ఎక్స్‌పోర్ట్ – ఇంపోర్ట్ కంటైనర్ రైళ్లలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
Also Read: One Rupee Train Ticket: ఒక్క రూపాయికే రైలు టికెట్.. ఇండియన్ రైల్వే ఐడియా అదుర్స్!
పర్యావరణ హితమైన టెక్నాలజీ
ఈ లోకోమోటివ్ విద్యుత్ ఆధారంగా నడుస్తుండటంతో, కాలుష్యం శూన్యానికి సమానం. డీజిల్ ఇంజిన్లను తొలగించి, పూర్తిగా విద్యుత్ ఆధారంగా నడిపే ట్రైన్లవైపు భారత రైల్వే అడుగులు వేస్తోంది.
ఇది రైలు కాదు.. ఇదొక శక్తి
ఈ రైలు చూసినవారికి ఇది సాధారణ ఇంజిన్ కాదన్న మాట స్పష్టంగా అర్థమవుతుంది. అల్యూమినియం బాడీ, శక్తివంతమైన రోటర్లు, ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టం.. ఇవన్నీ కలిపి ఈ ఇంజిన్‌ను భారత రైల్వే గర్వంగా చూపించే పరికరంగా నిలిపాయి.
రైల్వే ఫేస్‌బుక్, యూట్యూబ్ పేజీల్లో ఈ లోకోమోటివ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భవిష్యత్తు మరింత వేగవంతం
మన దేశం వందే భారత్, బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రయాణికుల రైళ్లలో ఎంత వేగంగా ఎదుగుతుందో, ఇప్పుడు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ లోనూ అంతే శక్తివంతంగా ఎదుగుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లకు 9000 HP లోకోమోటివ్‌లు హడావుడిగా తిరుగుతాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే.. జెట్ స్పీడ్ ట్రైన్.. ఇక ఆగేదే లేదు. ఇది కొత్త లోకోమోటివ్ కాదు, భారతీయ రైల్వే తాలూకు కొత్త శక్తి. వేగం, సామర్థ్యం, సాంకేతికత అన్నింటిలోనూ ఇది ఇండియన్ రైల్వే అభివృద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. వందేభారత్ ప్రయాణీకుల కోసం పరుగులు పెడుతుంటే, ఇది మాత్రం సరుకుల, ఇతర రవాణా వ్యవస్థలో హై స్పీడ్ గా దూసుకెళ్లడం ఖాయం. ఎందుకో తెలుసా.. ఎంతైనా ఇండియన్ రైల్వే కదా!