OTT Movie : మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సింపుల్ స్టోరీలను కూడా ఈ దర్శకులు చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ జనర్ లో వచ్చింది. దీనికి ఒక లవ్ స్టోరీని కూడా జత చేశారు. రీసెంట్ గా థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా, ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
సుజిత్ కుమార్ (సజిన్ గోపు) ఒక చిన్న పట్టణంలో గ్రాఫిక్ డిజైన్ షాప్ నడుపుతూ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అతను సోషల్ మీడియాలో కవితలు, డైలాగులను సరదా పోస్ట్ చేస్తుంటాడు. అతని జీవితం సాఫీగా సాగుతుండగా, ఒక అనుకోని సంఘటన అతన్ని చట్టపరమైన సమస్యల్లోకి నెట్టివేస్తుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి, సుజిత్ మానసిక అనారోగ్య ధృవీకరణ పత్రం (ఫేక్ సర్టిఫికేట్) పొందాల్సి వస్తుంది. అందువల్ల అతను కొన్ని రోజులు మానసిక ఆసుపత్రిలో గడపాల్సి వస్తుంది. మరోవైపు షీబా బేబీ అనే యువతి తన సవతి తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహం నుండి తప్పించుకోవడానికి ఇంటి నుండి పారిపోతూ ఉంటుంది. ఆమె చదువుకోవాలని, తన ఆస్తిని సొంతం చేసుకోవాలని కోరుకుంటుంది. తన ప్లాన్‌లో భాగంగా, ఆమె స్థానిక గుండా పీటర్‌తో పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు అంతగా ఫలించవు.
ఒక రోజు రాత్రి సమయంల సుజిత్ తన స్నేహితుడు అనీష్ కు ప్రేమ వ్యవహారంలో సహాయం చేస్తుంటాడు. ఈ సమయంవ షీబాతో సుకుకి అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. సుజిత్, షీబా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుంటారు. సుజిత్ తన కవితలతో షీబాను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ షీబా అతని ప్రేమను తిరస్కరిస్తుంది. నీమీద నాకు ఆ ఫీలింగ్స్ లేవని చావుకబురు చల్లగా చెప్తుంది. ఇంతలో సుకుని పొరుగింటి అమ్మాయి సుమ ప్రేమిస్తుంటుంది. ఈ విషయం తెలిసి సుజిత్ ఆలోచనలో పడతాడు. చివరికి సుజిత్ లవ్ స్టోరీ ఏమౌతుంది ? అతనికి మెంటల్ పేషెంట్ గా ఫేక్ సర్టిఫికేట్ దొరుకుతుందా ? షీబాకి సమస్యలు తొలగిపోతాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి ఆనుకుంటే, ఈ మలయాళ కామెడీ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : లవర్‌తో పనయ్యాక చంపేస్తాడు… పోలీసులకే చమటలు పట్టించే అబ్బాయి కథ ఇది
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘పైన్‌కిలి’ (Painkili). 2025లో విడుదలైన ఈ సినిమాకి జితు మాధవన్ స్టోరీ రచించగా, శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించారు. ఇందులో సజిన్ గోపు, అనస్వర రాజన్, రోషన్ షానవాస్, చందు సలీంకుమార్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఫహద్ ఫాసిల్, జితు మాధవన్ కలసి నిర్మించారు. మనోరమా మాక్స్ (Manorama MAX),అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.