BigTV English

AP New Ration Card: కొత్త రేషన్ కార్డుకై అప్లై చేస్తున్నారా? ఈ తప్పులు చేయవద్దు.. పూర్తి వివరాలు మీకోసమే..

AP New Ration Card: కొత్త రేషన్ కార్డుకై అప్లై చేస్తున్నారా? ఈ తప్పులు చేయవద్దు.. పూర్తి వివరాలు మీకోసమే..

AP New Ration Card: మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా? అయితే ఎలా అప్లై చేయాలి? అప్లై చేసే సమయంలో అప్లికేషన్ లో ఏయే వివరాలు పొందుపరచాలి? నగదు చెల్లించాలా? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎటువంటి ఆధారాలు సమర్పించాలన్న అనుమానాలు ఉన్నాయా? అయితే ఈ ప్రత్యేక కథనం మీకోసమే.


లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
రేషన్ కార్డు సర్వీసులను ఓపెన్ చేస్తూ ప్రభుత్వం సంచల నిర్ణయాన్ని తీసుకుంది. ఎంతోకాలంగా New Ration Cards , Ration Card Adding , Ration Card Split వంటి ముఖ్యమైన సేవలు కోసం రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు. అందుకు కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా 7 Ration Card Services కొరకు Option ను Grama Ward Sachivalayams లో ఇవ్వడం జరిగింది. మే 31వరకు అధికారులు మీ వద్ద దరఖాస్తులను స్వీకరిస్తారు.

మే 2 వ వారంలో మరో ఆప్షన్..
మొత్తం 7 రకాల సర్వీసుల కొరకు ఏ సచివాలయ పరిధికి వస్తారో ఆ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం మే రెండవ వారం నుండి Manamitra WhatsApp Governance ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ ను కల్పించనుంది.


నగదు ఎంత చెల్లించాలి?
రేషన్ కార్డు విభజన మినహా మిగిలిన సర్వీస్లన్నిటికీ అప్లికేషన్ ఫీజు రూ. 24 మాత్రమే చెల్లించాలి. రేషన్ కార్డు విభజనకు మాత్రం 48 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

రశీదు ఎలా పొందాలి?
దరఖాస్తుదారుడు దరఖాస్తు ఫారంతో సరిపడా సపోర్టింగ్ డాక్యుమెంట్లతో గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును పొందుతాడు. రసీదులో ఇచ్చినటువంటి దరఖాస్తు నెంబరు T Number తో మొదలైనటువంటి నెంబర్తో సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లేదా వీఆర్వో లేదా డిజిటల్ అసిస్టెంట్ లేదా మహిళ పోలీస్ GSWS Employees App లో Ration Card eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది.

అప్లై తర్వాత జరిగేది ఇదే..
ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత సంబంధిత అప్లికేషన్ VRO Web Site కు ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధిత MRO తుది ఆమోదం కొరకు వారి లాగిన్ కు వెళ్తుంది. ఆ లాగిన్ లో డిజిటల్ కి ద్వారా అప్లికేషన్ ఆమోదం తెలుపుతారు. గతంలో VRO లాగిన్ లో కార్డు ప్రింటింగ్ ఆప్షన్ ఉండేద. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏవైతే కార్డులన్ని ఈకేవైసి పూర్తయి ఎమ్మార్వో వారి లాగిన్ లో తుది ఆమోదం అవుతాయో వాటిని, ఇప్పటివరకు ఉన్నటువంటి రైస్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ ఉండి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తుంది.

రశీదుతో కలిగే ప్రయోజనం
అప్లికేషన్ నెంబర్ T తో మొదలైన నెంబర్ తో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది? ఎవరు ఏ రోజున ఆమోదం తెలిపారనే వివరాలు మీరు అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read: AP Womens: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్ల పంపిణీపై క్లారిటీ ఇదే..

అప్లికేషన్ ను ఎలా పూరించాలి?
మొదటగా మీసేవలో కానీ, స్థానిక సచివాలయంలో కానీ దరఖాస్తు పొందాలి. ఉదాహరణకు నూతన రేషన్ కార్డు కొరకు అప్లై చేసే వారికి వేరే అప్లికేషన్ ఉంటుంది. అందులో ముందుగా కుటుంబ యజమాని పేరు, అలాగే కుటుంబ సభ్యుల పేర్లు రాయాలి. అలాగే అందరి ఆధార్ కార్డు నెంబర్లను తప్పక రాయాలి. అలాగే అప్లికేషన్ సమర్పించే వ్యక్తి అంటే కుటుంబ యజమాని వివరాలను నమోదు చేయాలి. అంతేకాకుండా ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం వివరాలు కూడా నమోదు చేయాలి. వివరాలన్నీ అన్నీ సరి చూసుకోవాలి.

ఏయే పత్రాలు కావాలి
నూతన రేషన్ కార్డు కొరకు అప్లై చేసే వారు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్సు పేపర్లను తప్పక సమర్పించాలి.

ఈ తప్పులు చేయవద్దు..
ఆధార్ కార్డు నంబర్‌లో అక్షర దోషాలు లేకుండా చూడాలి. చిరునామాలో తప్పులు ఉండకూడదు. స్పష్టంగా లేని డాక్యుమెంట్లు సమర్పించవద్దు. ఒకే ఇంటి కోసం పలుమార్లు అప్లై చేయడం, అలాగే నకిలీ ఆధారాలతో అప్లై చేయడం తగదు. ఇవన్నీ గుర్తుంచుకుంటే చాలు, మీకు అర్హత ఉంటే మీరు రైస్ కార్డు తప్పక పొందుతారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×