Video Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 57 మ్యాచ్ ల వరకు పూర్తయ్యాయి. దాదాపు ప్లే ఆఫ్ జట్లు ఏవి అనేది క్లారిటీ కూడా వచ్చేసింది. ఇంటికి వెళ్లే జట్టు కూడా కన్ఫామ్ అయినట్లే. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ టోర్నమెంట్లో అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టేడియంలో కెమెరామెన్లు అద్భుతంగా… వీడియోలు తీస్తూ టెలికాస్ట్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే.. ఎక్కువసేపు క్యాప్చర్ చేస్తున్నారు. ఇలా ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో చాలా సంఘటనలే జరిగాయి.
Also Read: SRH Political Leaders : SRH టీమ్ లో నారా లోకేష్, బండి సంజయ్.. అంపైర్ గా RGV
స్టేడియంలోనే ముద్దులు పెట్టుకుంటున్న లవర్స్
అయితే తాజాగా చిన్నస్వామి స్టేడియంలో… ఓ జంట మ్యాచ్ చూస్తూ… రచ్చ చేసింది. మ్యాచ్ చూస్తూనే మధ్యలో ముద్దుల ఆట ప్రారంభించింది. ఇద్దరు లవర్స్ సినిమా థియేటర్కు వెళ్లినట్లు స్టేడియానికి వెళ్లి ముద్దులాట… మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు చేయి వేసుకొని.. ఇద్దరు లవర్స్ ముద్దులు పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను వెనుక నుంచి… ఎవరో రికార్డ్ చేశారు. ఆ రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఆ వీడియో కాస్త క్షణాల్లోనే వైరల్ అయింది.
ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒరేయ్ మీకు… ప్లేస్ ఎక్కడ దొరకలేదా..? సినిమా థియేటర్కు వెళ్లి ముద్దులాట ఆడుకోవాలి కానీ స్టేడియంలో ఆడుకుంటారా ? అంటూ ఫైర్ అవుతున్నారు. లేకపోతే oyo రూమ్ బుక్ చేసుకుని అందులో ఎంజాయ్ చేయండి అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ స్టేడియానికి వచ్చి ముద్దులాట ఆడి జంటను మిమ్మల్ని చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఒకే స్టేడియంలో రెండు మ్యాచ్లు జరుగుతున్నాయని కూడా సెటైర్లు పేల్చుతున్నారు. దీంతో ఈ వీడియో… సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడుతోంది. గతంలో ఎన్నడు లేని విధంగా దుమ్ము లేపుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ తరుణంలోనే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇప్పటివరకు 11 మ్యాచ్లు వాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించి 16 పాయింట్లు సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు అయినట్లే అని చెబుతున్నారు. ఇక అటు మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ గా…. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఎలిమినేట్ అయిపోయాయి. అటు కేకేఆర్ జట్టు కూడా.. ఇంటి దారి పట్టే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!
?igsh=eGQ0MWQ2N3NkeHNv
?igsh=eGQ0MWQ2N3NkeHNv